Digital Payments | ఏప్రిల్ 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్.. డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత..
Digital Payments | దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ చెల్లింపుల విధానం పూర్తిగా మారనుంది. యూపీఐ, కార్డులు లేదా వాలెట్లను ఉపయోగించే వారు ఇకపై అదనంగా సెక్యూరిటీ చెక్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు కొత్తగా టు-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (రెండు-దశల ధ్రువీకరణ)ను అమలు చేయనుంది.
Digital Payments | దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ చెల్లింపుల విధానం పూర్తిగా మారనుంది. యూపీఐ, కార్డులు లేదా వాలెట్లను ఉపయోగించే వారు ఇకపై అదనంగా సెక్యూరిటీ చెక్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు కొత్తగా టు-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (రెండు-దశల ధ్రువీకరణ)ను అమలు చేయనుంది. అంటే ఇకపై ఓటీపీతోపాటు మరేదైనా ఇతర మార్గంలో కూడా వినియోగదారులు సెక్యూరిటీ చెక్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పేమెంట్లకు ఆథెంటికేషన్ మరింత కట్టుదిట్టం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల పేమెంట్ చేసే సమయం కాస్త పెరిగినా డిజిటల్ చెల్లింపులను వినియోగదారులు మరింత సురక్షితంగా చేసేందుకు వీలుంటుంది. అలాగే మోసాలను తగ్గించవచ్చని ఆర్‌బీఐ తెలియజేసింది.
అతి ముఖ్యమైన టు-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్..
ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల్లో అతి ముఖ్యమైంది టు-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. దీన్ని ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్‌కు తప్పనిసరి చేశారు. ఈ విధానంలో పేమెంట్ పూర్తి చేసేందుకు కేవలం ఓటీపీ ఒక్కటే సరిపోదు. ప్రతి చెల్లింపుకు కనీసం రెండు ధ్రువీకరణ పద్ధతులను తప్పనిసరి చేశారు. అవి పిన్, పాస్‌వర్డ్, బయో మెట్రిక్స్ లేదా టోకెన్ల రూపంలో ఉంటాయి. ఓటీపీతోపాటు ఆయా పద్ధతుల్లో దేన్నయినా ఒకదాన్ని వినియోగదారులు ఎంచుకుని ధ్రువీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే పేమెంట్ సక్సెస్ అవుతుంది. సులభంగా చెప్పాలంటే వినియోగదారులు ఒక పేమెంట్ చేసేందుకు ఇకపై రెండు సార్లు సెక్యూరిటీ చెక్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1 నుంచి అమలు..
ఇప్పటి వరకు ఆన్‌లైన్ చెల్లింపులకు ఓటీపీలనే ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాల కారణంగా ఈ కొత్త విధానాన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. ఇకపై ఆన్ లైన్ పేమెంట్ల విషయంలో ఓటీపీ ధ్రువీకరణలో ఒక భాగంగానే ఉంటుంది. దానికి తోడు పిన్ లేదా ఫింగర్ ప్రింట్ వంటి రెండో దశ సెక్యూరిటీ చెక్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అనధికార లావాదేవీలకు, మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఈ కొత్త నిబంధనను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. అయితే ఈ రూల్ కారణంగా ఇకపై పేమెంట్లను చేసేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. పరిచిత డివైస్‌లలో సాధారణ యూజర్లకు సులభమైన ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. కొత్త డివైస్‌లు లేదా పెద్ద మొత్తాల చెల్లింపులకు అదనపు తనిఖీలు అవసరం అవుతాయి. ఇకపై రిస్క్ ఆధారిత ధ్రువీకరణ విధానం అమల్లో ఉంటుంది. అంటే లావాదేవీ రకం, వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా భద్రతా స్థాయిని నిర్ణయిస్తారు.

బ్యాంకులపై పెరగనున్న బాధ్యత..
ఈ కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు కూడా ఉంది. వీటి వల్ల బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సిస్టమ్ లోపాల వల్ల మోసం జరిగితే వినియోగదారులకు బ్యాంకులు, ఆయా ప్లాట్‌ఫామ్‌లే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో వినియోగదారులకు సత్వర పరిష్కారం లభిస్తుంది. దీని వల్ల బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి. ఆర్థిక సంస్థలపై భద్రతను మెరుగు పరచాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అంతర్జాతీయ చెల్లింపులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు అంతర్జాతీయ చెల్లింపులకు ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. దీని వల్ల అంతర్జాతీయ స్థాయి లావాదేవీలకు కూడా భద్రత పెరుగుతుంది.
మోసాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యం..
దేశంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అధిక సంఖ్యలో పెరుగుతూ ఆందోళనను కలిగిస్తున్నాయి. అందువల్లే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాలను తగ్గించడం, డిజిటల్ చెల్లింపులపై నమ్మకాన్ని పెంచడం, యూపీఐ, కార్డు చెల్లింపులకు మరింత సెక్యూరిటీ కల్పించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ కొత్త రూల్స్ వల్ల చెల్లింపులు చేసేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టినా మొత్తం భధ్రతా స్థాయి గణనీయంగా మెరుగు పడుతుందని చెబుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






