త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Post Office Time Deposit Scheme | 5 ఏళ్ల‌లో రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీ రావాలంటే ఏం చేయాలి..? సుర‌క్షితంగా ఎలా పొంద‌వ‌చ్చు..?

Post Office Time Deposit Scheme | డ‌బ్బు సంపాదించేవారు ఎవ‌రైనా స‌రే కాస్త డ‌బ్బు మిగిలితే దాన్ని సుర‌క్షిత‌మైన మార్గాల్లో పెట్టుబ‌డిగా పెట్టాల‌ని, ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌జ‌ల‌కు అనేక పొదుపు స్కీములు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ) పథకం కూడా ఒక‌టి.

S

Business | Published On Jan 16, 2026, 7.13 am IST

Post Office Time Deposit Scheme | 5 ఏళ్ల‌లో రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీ రావాలంటే ఏం చేయాలి..? సుర‌క్షితంగా ఎలా పొంద‌వ‌చ్చు..?
Advertisement

Post Office Time Deposit Scheme | డ‌బ్బు సంపాదించేవారు ఎవ‌రైనా స‌రే కాస్త డ‌బ్బు మిగిలితే దాన్ని సుర‌క్షిత‌మైన మార్గాల్లో పెట్టుబ‌డిగా పెట్టాల‌ని, ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌జ‌ల‌కు అనేక పొదుపు స్కీములు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ) పథకం కూడా ఒక‌టి. పెట్టుబ‌డిపై ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడులు పొందాలనేది ప్రతి పెట్టుబడిదారుడి ఆశ. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనేక భద్రమైన పొదుపు పథకాలను అందిస్తోంది. వాటిలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాన్ని అద్భుతమైందిగా చెప్ప‌వ‌చ్చు.

1 నుంచి 5 ఏళ్ల వ‌ర‌కు..

స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు వేగంగా పెరుగుతున్నప్పటికీ, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే వారు ఇప్పటికీ ప్రభుత్వ పథకాలకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, స్థిరమైన వడ్డీతో నిశ్చిత లాభాలు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ పథకాలను ఎంచుకుంటున్నారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే, ఈ టైమ్ డిపాజిట్ పథకంలో 1 ఏడాది నుంచి 5 ఏళ్ల వ‌ర‌కు ఎన్ని సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధితో అయినా స‌రే డబ్బు జమ చేయవచ్చు. గడువు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం వడ్డీతో సహా తిరిగి అందుతుంది. ఈ పథకం పూర్తిగా రిస్క్ రహితం కాగా, వడ్డీ రేటు కూడా స్థిరంగా ఉంటుంది.

7.5 శాతం గ‌రిష్ట వ‌డ్డీ రేటు..

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కాల వ్య‌వ‌ధిని బ‌ట్టి ప‌లు ర‌కాలుగా ఉన్నాయి. 1 సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం వ‌డ్డీ రేటును అందిస్తున్నారు. అలాగే 2 సంవత్సరాల డిపాజిట్‌పై 7.0 శాతం వ‌డ్డీ రేటు ల‌భిస్తుంది. ప్ర‌జ‌లు 3 ఏళ్ల పాటు ఇందులో పెట్టుబ‌డి పెడితే 7.1 శాతం వ‌డ్డీ రేటును ఇస్తారు. అదే 5 ఏళ్ల కాలవ్య‌వ‌ధికి గాను 7.5 శాతం వ‌డ్డీ రేటును అత్య‌ధికంగా పొంద‌వ‌చ్చు. అయితే ఈ రేట్లు స్థిరంగా ఉండటంతో, దీర్ఘకాలిక పెట్టుబడులకు 5 సంవత్సరాల పథకాన్ని ఉత్తమ ఎంపికగా చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఉదాహరణకు రూ.5 లక్షల‌ను 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడిగా పెడితే గడువు ముగిసే సరికి మొత్తం రూ.7,24,975 అవుతుంది. ఇందులో రూ.2,24,975 ల‌ను కేవలం వడ్డీ రూపంలోనే పొంద‌వ‌చ్చు. ఇలా 5 ఏళ్ల కాలవ్య‌వ‌ధిలో ఈ ప‌థ‌కం ద్వారా రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీని చాలా సుర‌క్షితంగా పొంద‌వచ్చు. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా ఈ లాభం వస్తుంది.

ఈ పథకం అన్ని వయసుల వారికి అనుకూలమైనదే. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు కూడా 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం భద్రమైన పెట్టుబడిగా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 5 ఏళ్ల పాటు స్థిర‌మైన వ‌డ్డీరేటుతో సుర‌క్షితమైన ఆదాయం పొందాల‌ని చూస్తున్న వారికి ఈ ప‌థ‌కం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement