Penny Stocks | రూ.1 లక్ష పెడితే రూ.1 కోటి.. పెన్నీ స్టాక్స్ పవర్ ఇదే..
Penny Stocks | స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే.. స్టాక్స్ కొని వెంటనే అమ్మడం కాదు. బై, హోల్డ్, ఫర్గెట్.. అంటే కొని దగ్గరే పెట్టుకుని వాటి గురించి మరిచిపోవాలన్నమాట. ఇదే విషయాన్ని ప్రముఖ ఇన్వెస్టర్లు సైతం చెబుతుంటారు.
Penny Stocks | స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే.. స్టాక్స్ కొని వెంటనే అమ్మడం కాదు. బై, హోల్డ్, ఫర్గెట్.. అంటే కొని దగ్గరే పెట్టుకుని వాటి గురించి మరిచిపోవాలన్నమాట. ఇదే విషయాన్ని ప్రముఖ ఇన్వెస్టర్లు సైతం చెబుతుంటారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ ఒకసారి చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటే.. డబ్బు సంపాదించడం అంటే స్టాక్స్ కొనడం, అమ్మడం వల్ల రాదు, వేచి ఉండడం వల్ల వస్తుంది. ఇదే విషయాన్ని అనేక మంది పెట్టుబడిదారులు పాటిస్తుంటారు కూడా. చాలా మంది ఎక్కువ కాలం వేచి చూడకుండానే మధ్యలోనే విరమించుకుంటారు. దీంతో ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోతంటారు. అయితే తక్కువ ధర కలిగిన ప్రముఖ కంపెనీలకు చెందిన షేర్లు అనతి కాలంలోనే భారీగా పెరుగుతాయని, అందువల్ల అలాంటి పెన్నీ స్టాక్స్‌ను వెదికి కొంటే ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెన్నీ స్టాక్స్‌ను తక్కువగా అంచనా వేయవద్దని సూచిస్తున్నారు.
12,940 శాతం మేర రాబడి..
సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత కొన్నేళ్లలో తన షేర్‌హోల్డర్లకు భారీ రాబడులు అందించింది. గత ఎనిమిదేళ్లలో ఈ షేర్ ధర రూ.12.50 నుంచి దాదాపు రూ.1630 వరకు పెరిగి, దీర్ఘకాల పెట్టుబడిదారులకు 12,940 శాతం రాబడులు ఇచ్చింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.677.45 నుంచి రూ.1,630 వరకు పెరిగి, పెట్టుబడిదారులకు సుమారు 140 శాతం లాభం అందించింది. ఈ సంవత్సర ప్రారంభం (వైటీడీ) నుంచి ఇప్పటివరకు దాదాపు 20 శాతం రాబడిని ఇచ్చింది. ఒక సంవత్సరంలో ఈ షేర్ రూ.400 నుంచి రూ.1,630 వరకు పెరిగింది. ఐదు సంవత్సరాల కాలంలో రూ.36.50 నుంచి రూ.1,630 వరకు పెరిగి, సుమారు 4,350 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
రూ.1 లక్ష పెడితే రూ.1 కోటి..
2017 మే 18న రూ.12.50 వద్ద ఉన్న ఈ షేర్, 2026 ఏప్రిల్ 30న రూ.1,630 వద్ద ముగిసింది. అంటే గత తొమ్మిదేళ్లలో ఇది 12,940 శాతం పెరిగింది. సియాన్ అగ్రో షేర్ ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఒక నెల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి కొనసాగించినట్లయితే అది రూ.2.40 లక్షలుగా మారేది. 2025 చివరలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు ఉంటే అది రూ.1.20 లక్షలకు పెరిగేది. అలాగే ఐదు సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే అది రూ.44.50 లక్షలకు పెరిగేది. ఇక తొమ్మిదేళ్ల క్రితం రూ.12.50 వద్ద రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు ఉంచి ఉంటే అది రూ.1.30 కోట్లుగా మారి ఉండేది.
సహనం అవసరం..
సియాన్ అగ్రో ఇండస్ట్రీస్ షేర్లు కేవలం బీఎస్‌ఈలో మాత్రమే లిస్టింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ట్రేడింగ్‌లో 1.98 లక్షల వాల్యూమ్ నమోదు చేసింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.3,633.15 కాగా, కనిష్ట ధర రూ.378.10గా నమోదైంది. స్టాక్ మార్కెట్‌లో నిజమైన సంపద తక్షణ లాభాల్లో కాకుండా, దీర్ఘకాల పెట్టుబడిలోనే దాగి ఉందనే విషయాన్ని ఈ షేర్ ధర తెలియజేస్తోంది. సరైన స్టాక్‌ను ఎంచుకుని, సహనంతో కొనసాగించడం ద్వారా పెట్టుబడిదారులు విశేషమైన సంపదను సృష్టించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



