త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oracle layoffs | ఓపెన్ ఏఐ కోసం నిధుల వేట‌.. 30,000 మందిపై ఒరాకిల్ వేటు..?

Oracle layoffs | ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle layoffs) ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 30,000 మంది ఉద్యోగాల్ని తొలగించేందుకు సిద్ధమైన‌ట్లు తెలిసింది.

D

Business | Published On Feb 3, 2026, 10.51 am IST

Oracle layoffs | ఓపెన్ ఏఐ కోసం నిధుల వేట‌.. 30,000 మందిపై ఒరాకిల్ వేటు..?
Advertisement

Oracle layoffs | టెక్‌ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ (IT) సెక్టార్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్నీ తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ.. మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఫ‌లితంగా వేలాది మంది టెకీలు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది.

ఇప్ప‌టికే దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్ స‌హా గూగుల్, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, అమెజాన్‌, హెచ్‌పీ, యాపిల్‌, మెటా.. వంటి పెద్దపెద్ద సంస్థలు ఖర్చు తగ్గించుకునేందుకు ఎడాపెడా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle layoffs) వ‌చ్చి చేరింది. ఒరాకిల్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 30,000 మంది ఉద్యోగాల్ని తొలగించేందుకు సిద్ధమైన‌ట్లు తెలిసింది. ఈ లేఆఫ్స్‌కు కారణం ఓపెన్ఏఐ అని మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఓపెన్ ఏఐతో ఒప్పంద‌మే లేఆఫ్స్‌కు కార‌ణం..

నివేదిక‌ల‌ ప్రకారం.. ఓపెన్ఏఐ (OpenAI) సంస్థతో ఒరాకిల్ 300 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ఉద్దేశంతో ఒరాకిల్ భారీగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ఇందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంది. అందుకోసం నిధులు స‌మ‌కూర‌డం లేదు. ఫ‌లితంగా సంస్థ ఉద్యోగుల‌కు లేఆఫ్స్ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ లేఆఫ్స్‌తో 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయొచ్చ‌ని సంస్థ భావిస్తోంది. ఏఐ కోసం సంస్థ త‌న ఉద్యోగుల‌నే కాదు, క‌స్ట‌మ‌ర్ల‌ను కూడా టార్గెట్ చేసింది. కొత్తగా వచ్చే కస్టమర్లు తమ ఫీజులో 40 శాతం ముందుగానే చెల్లించాలని షరతులు విధిస్తోంది.

ఏఐ మౌలిక స‌దుపాయాల కోసం 156 బిలియ‌న్ డాల‌ర్లు అవ‌స‌రం

ఏఐ కోసం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు సంస్థ‌కు దాదాపు 156 బిలియిన్ డాల‌ర్లు అవ‌స‌రం ఉంది. ఇంత మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు అమెరికా బ్యాంకులు ముందుకు రావ‌డంలేదు. ఒకవేళ అప్పులు ఇవ్వాలన్నా.. వడ్డీ రేట్లు రెట్టింపు చేస్తున్నాయి. కొన్ని ఆసియా బ్యాంకులు మాత్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. అవి సరిపోవు. అందుకే సంస్థ త‌న సొంత‌వ‌న‌రుల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఉద్యోగుల‌కు లేఆఫ్స్ ఇచ్చి కొంత‌మేర డ‌బ్బు ఆదా చేయాల‌ని భావిస్తోంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement