Petrol Price Hike | వాహనదారులకు చమురు కంపెనీల షాక్.. ప్రీమియం పెట్రోల్‌పై రూ.2 పెంపు..!
Petrol Price Hike | ఇంధన కంపెనీలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. ప్రీమియం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2 ధర పెంచాయి. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది.
Petrol Price Hike | ఇంధన కంపెనీలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. ప్రీమియం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2 ధర పెంచాయి. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. డీలర్లు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇండియన్ ఆయిల్ ఎక్స్‌పీ95, హిందూస్థాన్ పెట్రోలియం పవర్ పెట్రోల్ వంటి హై-ఆక్టేన్ పెట్రోల్ ధర పెరిగింది. తాజాగా ధరలను సవరించడంతో ధర రూ.115కి చేరింది. ప్రీమియం, హై-ఆక్టేన్ పెట్రోల్‌ని సాధారణంగా ఎక్కువ పనితీరు, మోటారు వాహనాల ఇంజిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వాడుతుంటారు. ఇవి కొన్ని వాహనాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. తక్కువ మొత్తంలో దీన్ని వినియోగిస్తుంటారు.
అయితే, ప్రీమియం పెట్రోల్ ధర నగరాల ఆధారంగా మారిందని డీలర్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో లీటర్‌కు సుమారు రూ. 2.09 పెరుగుదల కనిపించింది. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన నగరాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల్లో ఒప్పందం లేకపోయినా సాధారణ పెట్రోల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రీమియం ఇంధన ధరల పెరుగుదలకు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల అస్థిరత కారణమని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లకుపైగా ట్రేడవుతోంది. సరఫరా అంతరాయం భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ అధిక భాగం ఇంధనాన్ని దిగుమతి చేస్తుండడంతో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వ్యయం పెరుగుతోంది.
మరో వైపు రూపాయి పతనమవుతుండడంతో ఇంధన దిగుమతులపై మరింత భారం పెరుగుతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగలేదని.. కేవలం ప్రీమియం వేరియంట్లపై సెలెక్టివ్‌గా పెంపు జరిగిందని.. సాధారణ ప్రజలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని డీలర్లు పేర్కొంటున్నారు. ఎక్కువ మంది వాహనదారులు రెగ్యులర్ పెట్రోల్ వినియోగిస్తుంటారని తెలిపారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్ పడుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-యూఎస్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతిగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దాంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా పెట్రోల్ ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే సామాన్యులపై మరింత భారపడే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





