Investors | స్టాక్ మార్కెట్ల నుంచి తప్పుకుంటున్న పెట్టుబడిదారులు.. NSE గణాంకాల్లో వెల్లడి..
Investors | ఈ ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించింది. ఈ మేరకు NSE బుధవారం డేటాను విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధించాయని, అయితే ఏడాది కాలంగా ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోందని తెలిపింది.
Investors | ఈ ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించింది. ఈ మేరకు NSE బుధవారం డేటాను విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధించాయని, అయితే ఏడాది కాలంగా ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోందని తెలిపింది. కానీ మొత్తంగా చూసుకుంటే పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుదల దిశగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
7 శాతం మేర తగ్గిన ఇన్వెస్టర్ల సంఖ్య..
దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన NSE లో యాక్టివ్ ఇన్వెస్టర్ల సంఖ్య సుమారు 35-40 లక్షలు లేదా ఏడాదికి 7 శాతం మేర తగ్గిందని తేలింది. గత 3 సంవత్సరాల్లో ఇలా పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో NSEలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య సుమారు 4.90 కోట్ల నుంచి 4.55 కోట్లకు పడిపోయింది. బలమైన ఈక్విటీ మార్కెట్ ప్రదర్శన కారణంగా FY25లో రిటైల్ ట్రేడింగ్ లో ఇన్వెస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొనడంతో గరిష్ట స్థాయికి సూచీలు చేరుకున్నాయి. తర్వాత ఈ పతనం ప్రారంభమైంది.
యాక్టివ్ ట్రేడింగ్‌లో లేరు..
ఇక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త పెట్టుబడిదారుల చేరికలు మాత్రం బలంగానే కొనసాగాయి. దాంతో మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య దాదాపు 1.30 కోట్ల మేర పెరిగింది. అయితే ఈ కొత్త ఖాతాలలో అధిక శాతం మంది యాక్టివ్ ట్రేడింగ్‌లో పాల్గొనడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యాక్టివ్ ఇన్వెస్టర్ల తగ్గుదల ప్రధానంగా దేశంలోని అగ్ర బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌లలో ఏర్పడిందని NSE తెలిపింది. వీటి వద్దే NSE రిటైల్ క్లయింట్లలో అధిక భాగం ఉండటం వల్ల ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జీరోధా, ఏంజల్ వన్, అప్ స్టాక్స్ వంటి బ్రోకరేజ్ సంస్థలలో యాక్టివ్ ట్రేడింగ్ ఖాతాలు భారీగా తగ్గాయి. ముఖ్యం చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ కార్యకలాపాలను భారీగా తగ్గించారు. అందువల్లే పెట్టుబడిదారుల సంఖ్య తగ్గడంతోపాటు యాక్టివ్ ట్రేడింగ్ ఖాతాల సంఖ్య కూడా తగ్గింది. ఇక మార్కెట్ లీడర్ గా పేరుగాంచిన గ్రో బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ తన మార్కెట్ వాటాను 26.3 శాతం నుంచి 28.3 శాతానికి పెంచుకుంది. దీంతో మార్కెట్‌లో ఆ సంస్థ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.
బలహీనంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు..
మొత్తం యాక్టివ్ క్లయింట్ బేస్‌లో టాప్ నాలుగు బ్రోకర్లు సుమారు 63 శాతం వాటా కలిగి ఉండటంతో వీరిలో జరిగే ఏ మార్పు అయినా మొత్తం మార్కెట్ ట్రేడింగ్‌పై భారీగా ప్రభావం చూపుతోంది. సంప్రదాయ బ్రోకరేజ్ సంస్థలు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ సెక్యూరిటీస్ ఈ ఏడాది తమ మార్కెట్ వాటాను పెంచుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీన ప్రదర్శన కనబరిచాయి. బ్లూ-చిప్ నిఫ్టీ 50 సూచీ 4 శాతానికి పైగా పతనమవ్వగా, విస్తృత నిఫ్టీ 500 సూచీ దాదాపు 3 శాతం వరకు పడిపోయింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, వాణిజ్య, టారిఫ్ అనిశ్చితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల సాంప్రదాయ ఐటీ, కన్సల్టింగ్ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే కంపెనీల ఆదాయ వృద్ధి మందగమనంలో కొనసాగడం వంటి అంశాలు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



