Dabba Trading | ‘డబ్బా ట్రేడింగ్’తో జాగ్రత్త.. NSE హెచ్చరిక..
Dabba Trading | ట్రేడింగ్ ద్వారా కచ్చితమైన లాభాలు అందిస్తామని చెప్పే వ్యక్తులు లేదా సంస్థల మాటలను నమ్మి మోస పోవద్దని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) హెచ్చరికలు జారీ చేసింది. డబ్బా ట్రేడింగ్ (అక్రమ ట్రేడింగ్) నిర్వహిస్తూ పెట్టుబడిదారులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి గురించి ఎన్ఎస్ఈ వివరాలను తెలియజేసింది.
Dabba Trading | ట్రేడింగ్ ద్వారా కచ్చితమైన లాభాలు అందిస్తామని చెప్పే వ్యక్తులు లేదా సంస్థల మాటలను నమ్మి మోస పోవద్దని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) హెచ్చరికలు జారీ చేసింది. డబ్బా ట్రేడింగ్ (అక్రమ ట్రేడింగ్) నిర్వహిస్తూ పెట్టుబడిదారులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి గురించి ఎన్ఎస్ఈ వివరాలను తెలియజేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మొబైల్ యాప్ లు లేదా వెబ్ సైట్ల ద్వారా కొందరు డబ్బా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారని, అలాంటి వారు పెట్టుబడి దారులకు కచ్చితమైన లాభాలను అందిస్తామని మోసం చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎన్ఎస్ఈ సూచించింది. ఈ మేరకు అలా డబ్బా ట్రేడింగ్ చేస్తున్న గిరి అనే వ్యక్తికి చెందిన వివరాలను వెల్లడించింది.
డబ్బా ట్రేడింగ్ చట్ట ప్రకారం నేరం: ఎన్ఎస్ఈ
గిరి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో డబ్బా ట్రేడింగ్, బాక్స్ ట్రేడింగ్ అనే గ్రూపుల ద్వారా, అలాగే ట్రేడ్‌జోన్ అనే మొబైల్ యాప్, వెబ్‌సైట్ లను ఉపయోగిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాడని గుర్తించారు. షేర్ మార్కెట్‌లో గ్యారంటీగా లాభాలు ఇస్తానని, పెట్టుబడులపై కచ్చితమైన రిటర్న్స్ వస్తాయని హామీ ఇస్తూ అతను పెట్టుబడిదారుల ట్రేడింగ్ అకౌంట్లను తానే నిర్వహిస్తానని చెప్పి, వారి లాగిన్ వివరాలు తీసుకుంటున్నాడని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇతని వల్ల మోసపోయి ఉంటారని ఎన్‌ఎస్‌ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఇలా గ్యారంటీ లాభాలు ఇస్తామని చెబుతూ, నకిలీ బ్రోకర్ యాప్‌లను ఉపయోగించడం చట్ట ప్రకారం నేరమే అవుతుందని తెలిపింది. కనుక ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గిరి లాంటి వ్యక్తులు లేదా సంస్థలు చాలా మంది ప్రజలను ఇలాగే మోసం చేస్తున్నారని, డబ్బా ట్రేడింగ్ భారతీయ సెక్యూరిటీస్ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
స్కీముల పట్ల దూరంగా ఉండండి: ఎన్ఎస్ఈ
సంబంధిత వ్యక్తి లేదా అతనికి సంబంధించిన సంస్థలు ఏవీ కూడా ఎన్‌ఎస్‌ఈలో నమోదైన బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్చేంజ్ వెల్లడించింది. ఇలాంటి స్కీములకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడిదారులు దూరంగా ఉండాలని, షేర్ బ్రోకర్ల వివరాలను ఎన్‌ఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లోని సౌకర్యం ద్వారా తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించింది. ప్రజలు ఎల్లప్పుడూ ఎక్స్చేంజ్ లో నమోదు అయి ఉన్న బ్రోకర్‌ల ద్వారానే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని తెలిపింది. అందుకు గాను ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించింది. ఇక సదరు గిరి అనే వ్యక్తి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నేరం రుజువు అయితే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) చట్టం - 1956లోని సెక్షన్లు 13, 16, 17 లేదా 19ల ప్రకారం నిందితులకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.25 కోట్ల వరకు భారీ జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో రెండింటినీ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






