Samsung | ఫోన్ వాడితే తలనొప్పా? Galaxy S27 Ultraలో కొత్త ఫీచర్!
Samsung | స్మార్ట్‌ఫోన్ ఎక్కువసేపు వాడితే కళ్లలో అలసట, తలనొప్పి వస్తోందా? అలాంటి వారికి గుడ్‌న్యూస్ త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం దొరకబోతున్నది. శామ్‌సంగ్ (Samsung) తన తదుపరి ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా (Galaxy S27 Ultra)లో కీలక డిస్‌ప్లే అప్‌గ్రేడ్స్‌ను తీసుకురాబోతున్నది. ఇందులో డీసీ డిమ్మింగ్ (DC Dimming) టెక్నాలజీ, కొత్త ఎం16 (M16) డిస్‌ప్లే ప్యానెల్‌తోపాటు ప్రైవసీ డిస్‌ప్లేలోనూ మార్పులు ఉండవచ్చని పలు నివేదిక తెలిపాయి.
- కంటి ఒత్తిడి తగ్గించేలా డీసీ డిమ్మింగ్ టెక్నాలజీ
- కొత్త M16 డిస్‌ప్లే ప్యానెల్‌తో మరింత మెరుగైన విజువల్స్
- ప్రైవసీ డిస్‌ప్లేలోనూ కీలక మార్పులు
Samsung | స్మార్ట్‌ఫోన్ ఎక్కువసేపు వాడితే కళ్లలో అలసట, తలనొప్పి వస్తోందా? అలాంటి వారికి గుడ్‌న్యూస్ త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం దొరకబోతున్నది. శామ్‌సంగ్ (Samsung) తన తదుపరి ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా (Galaxy S27 Ultra)లో కీలక డిస్‌ప్లే అప్‌గ్రేడ్స్‌ను తీసుకురాబోతున్నది. ఇందులో డీసీ డిమ్మింగ్ (DC Dimming) టెక్నాలజీ, కొత్త ఎం16 (M16) డిస్‌ప్లే ప్యానెల్‌తోపాటు ప్రైవసీ డిస్‌ప్లేలోనూ మార్పులు ఉండవచ్చని పలు నివేదిక తెలిపాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు..
కంటి అలసట తగ్గించే DC Dimming
సాధారణంగా చాలా స్మార్ట్‌ఫోన్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను నియంత్రించేందుకు పీడబ్ల్యూఎం డిమ్మింగ్ (PWM Dimming) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇందులో స్క్రీన్‌ను వేగంగా ఆన్, ఆఫ్ చేయడం ద్వారా కాంతిని నియంత్రిస్తారు. అయితే కొందరికి ఈ విధానం వల్ల కంటి అలసట, తలనొప్పి, అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే, డీసీ డిమ్మింగ్ మాత్రం డిస్‌ప్లేకు అందించే వోల్టేజ్‌ను మార్చడం ద్వారా బ్రైట్‌నెస్‌ను నియంత్రిస్తుంది. దీంతో కొందరు వినియోగదారులకు స్క్రీన్ చూడడంలో కలిగే అసౌకర్యం తగ్గే అవకాశం ఉంది. డీసీ డిమ్మింగ్, హైబ్రిడ్ డిమ్మింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కంటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని శామ్‌సంగ్ భావిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఫీచర్ అందరికీ ఒకే స్థాయిలో ప్రయోజనం కలిగిస్తుందని చెప్పలేమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త M16 ప్యానెల్‌తో మెరుగైన డిస్‌ప్లే
గెలాక్సీ ఎస్27 అల్ట్రాతోపాటు ఎస్27 ప్రోలోనూ కొత్త ఎం16 డిస్‌ప్లే ప్యానెల్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఇదే ప్యానెల్‌ను ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ డ్యుయో మోడళ్లలోనూ వినియోగించవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గెలాక్సీ ఎస్27, ఎస్27 ప్లస్ మోడళ్లలో ఎం14 ప్లస్ ప్యానెల్ ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త ఎం16 ప్యానెల్‌తో మరింత మెరుగైన బ్రైట్‌నెస్, తక్కువ విద్యుత్ వినియోగం, ఆకర్షణీయమైన రంగులు కనిపించే అవకాశం ఉంది. ఇందులో డీసీ డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి అంచనాలుగానే ఉన్నాయి.
Privacy Displayలోనూ మార్పులు?
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో ప్రవేశపెట్టిన ప్రైవసీ డిస్‌ప్లే (Privacy Display) ఫీచర్.. పక్కన ఉన్నవారికి ఫోన్ స్క్రీన్‌పై సమాచారం కనిపించకుండా రక్షణ కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్ వల్ల డిస్‌ప్లే నాణ్యత తగ్గుతోందని, రంగులు ఫేడ్ అయినట్లుగా కనిపిస్తున్నాయని కొందరు యూజర్లు ఫిర్యాదు చేసినట్లుగా నివేదిక తెలిపాయి. కంటి అలసట, తలనొప్పి వంటి సమస్యలపైనా ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గెలాక్సీ ఎస్27 అల్ట్రాలో ప్రైవసీ డిస్‌ప్లేను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా స్క్రీన్ రిజల్యూషన్, రంగుల నాణ్యతపై ప్రతికూల ప్రభావం తగ్గించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
iPhone 20 Proకు గట్టి పోటీ?
మెరుగైన డిస్‌ప్లే, కొత్త డిజైన్, పెద్ద బ్యాటరీ వంటి అప్‌గ్రేడ్‌లతో గెలాక్సీ ఎస్27 అల్ట్రాను మరింత పవర్‌ఫుల్ ప్రీమియం ఫోన్‌గా తీర్చిదిద్దాలని శామ్‌సంగ్ యోచిస్తున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2027లో విడుదలయ్యే ఐఫోన్ 20 ప్రోకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ ఫోన్‌ను రూపొందించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, గెలాక్సీ ఎస్27 అల్ట్రా విడుదలకు ఇంకా సమయం ఉంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
- ●Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!
- ●Rakul Preet Singh | అలనాటి దిగ్గజ హీరోయిన్గా రకుల్ - ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఛాన్స్
- ●IndiGo Flight Emergency Landing Hyderabad | విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
- ●Jantar Mantar Protest Site | నిరసనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్ మంతర్ కాలం చెల్లిందా?
- ●Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం

Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్

Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!

Rakul Preet Singh | అలనాటి దిగ్గజ హీరోయిన్గా రకుల్ - ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఛాన్స్

IndiGo Flight Emergency Landing Hyderabad | విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్






