త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty and Sensex | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. 6 లక్షల కోట్లు హాంఫట్

ఇక కంపెనీల్లో ఎం అండ్ ఎం కంపెనీ 4.23 శాతం పడి భారీ నష్టాలను మూటగట్టుకుంది. మారుతీ సుజుకీ 3.60 శాతం పడింది. బజాబ్ ఫైనాన్స్ 3.31 శాతం, ఎల్ అండ్ టీ 3.31 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.90 శాతం, ట్రెంట్ 2.46 శాతం నష్టపోయాయి.

J

Business | Published On Mar 12, 2026, 6.13 pm IST

Nifty and Sensex | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. 6 లక్షల కోట్లు హాంఫట్
Advertisement
  • 440.15 లక్షల కోట్లకు తగ్గిన కంపెనీల వాల్యూ
  • గత రెండు రోజుల్లో 2171 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 2 శాతం పడిన నిఫ్టీ

Nifty and Sensex | త్రినేత్ర.న్యూస్ : భారత స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ నడుస్తోంది. గత 10 రోజుల నుంచి మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. నిఫ్టీ వందల పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ వేల పాయింట్లు నష్టపోయింది. కొన్ని లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా స్టాక్ మర్కెట్లు రోజురోజుకూ వీక్ అవుతున్నాయి. ఎఫ్ఐఐలు కూడా వరుసగా సెల్లింగ్ బాట పట్టడంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను చవి చూస్తున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్స్‌లోనే 2171.56 పాయింట్లకు సెన్సెక్స్ నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో 829.29 పాయింట్లు పడి 1.08 శాతం నష్టంతో 76,034.42 వద్ద ముగిసింది. నిఫ్టీ గురువారం 227.70 పాయింట్లు పడి 0.95 శాతం నష్టంతో 23,639.15 వద్ద ముగిసింది. రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో నిఫ్టీ 2 శాతం పడింది. దీంతో కంపెనీల వాల్యూ భారీగా తగ్గింది. ఇన్వెస్టర్ల 6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్‌లో లిస్ట్ అయిన కంపెనీల వాల్యూ 440.15 లక్షల కోట్లకు తగ్గింది.

ఫిబ్రవరి నుంచి 2200 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ఫిబ్రవరి నెల నుంచి చూసుకుంటే నిఫ్టీ 2200 పాయింట్లకు పైగా పడి 8 శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం లాంటివి స్టాక్ మర్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల వాల్యూ రూ.446.70 లక్షల కోట్ల నుంచి రూ.440.15 లక్షల కోట్లకు తగ్గింది.

ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ ఇవే

ఇక కంపెనీల్లో ఎం అండ్ ఎం కంపెనీ 4.23 శాతం పడి భారీ నష్టాలను మూటగట్టుకుంది. మారుతీ సుజుకీ 3.60 శాతం పడింది. బజాబ్ ఫైనాన్స్ 3.31 శాతం, ఎల్ అండ్ టీ 3.31 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.90 శాతం, ట్రెంట్ 2.46 శాతం నష్టపోయాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కంపెనీలు లాభాలను గడించాయి.

Advertisement
Advertisement