Nifty 50 | మార్కెట్లపై గ్లోబల్ ట్రేడ్ భయాలు.. సెన్సెక్స్, నిఫ్టీకి భారీ నష్టం..
Nifty 50 | గత వారం బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు 0.5 శాతం పడిపోయింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, నెక్టర్ లైఫ్‌సైన్సెస్, జీటీపీఎల్ హాథ్‌వే, యూనివర్సల్ కేబుల్స్, తేజాస్ నెట్‌వర్క్స్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, లోటస్ చాక్లెట్ కంపెనీ, యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్, అమల్, ఇగారాషి మోటార్స్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్, గ్లోబస్ స్పిరిట్స్, జిందాల్ పాలీ ఫిలిమ్స్ వంటి కంపెనీల షేర్లు 10 నుంచి 18 శాతం వరకు నష్టపోయాయి.
Nifty 50 | గత వారం బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు 0.5 శాతం పడిపోయింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, నెక్టర్ లైఫ్‌సైన్సెస్, జీటీపీఎల్ హాథ్‌వే, యూనివర్సల్ కేబుల్స్, తేజాస్ నెట్‌వర్క్స్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, లోటస్ చాక్లెట్ కంపెనీ, యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్, అమల్, ఇగారాషి మోటార్స్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్, గ్లోబస్ స్పిరిట్స్, జిందాల్ పాలీ ఫిలిమ్స్ వంటి కంపెనీల షేర్లు 10 నుంచి 18 శాతం వరకు నష్టపోయాయి. అయితే వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ, జేటీఎల్ ఇండస్ట్రీస్, ఆంటిలోపస్ సెలాన్ ఎనర్జీ, ఐఎఫ్‌సీఐ, బజార్ స్టైల్ రిటైల్, ఏంజెల్ వన్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 3బీ బ్లాక్‌బయో డీఎక్స్, నియోజెన్ కెమికల్స్, ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ వంటి షేర్లు 15 నుంచి 62 శాతం వరకు లాభపడ్డాయి.
యూరప్ దేశాలపై టారిఫ్‌ల పెంపు హెచ్చరికలు..
జనవరి 19 ఉదయం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 561 పాయింట్లు తగ్గి 83,008 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 25,527 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ సమయంలో 1199 షేర్లు లాభాల్లో ఉండగా, 2283 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 195 షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీలో విప్రో, టాటా మోటార్స్ పీవీ, ఐసీఐసీఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటి కంపెనీల షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్‌లోని 8 దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, బ్రిటన్ నుంచి దిగుమతులపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం టారిఫ్, జూన్ 1 నుంచి 25 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో యూరప్ మార్కెట్లు 1 శాతంకు పైగా పతనం కాగా, జపాన్ నిక్కీకి 1 శాతం మేర నష్టం సంభవించింది. అలాగే అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ కూడా 0.7 శాతం మేర తగ్గాయి.

అమ్మకాలను కొనసాగిస్తున్న FIIలు..
ఇక డాలర్ బలహీనపడగా, యెన్, స్విస్ ఫ్రాంక్ బలపడ్డాయి. బిట్‌కాయిన్ దాదాపు 3 శాతం తగ్గి $92,602 వద్ద ట్రేడవుతోంది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ట్రంప్ టారిఫ్‌లు అమలైతే యూరప్ ప్రతీకారం తప్పదు. అప్పుడు గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలవుతుంది. దీని ప్రభావం మార్కెట్లపై ప్రతికూలంగా ఉంటుంది.. అని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పదవిపై కెవిన్ హాసెట్ నియామకం అనిశ్చితంగా ఉండటంతో వడ్డీ రేట్ల తగ్గింపులపై అంచనాలు తగ్గాయి. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయ సూచికగా భావించే ఇండియా VIX 5 శాతం పెరిగి 11.98కు చేరింది. ఇది అప్రమత్తతను సూచిస్తోంది. కాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) వరుసగా 9వ రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. ఒక్క రోజే రూ.4,346 కోట్ల అమ్మకాలు జరిపారు. జనవరి 16వ తేదీ వరకు మొత్తం రూ.22,529 కోట్ల అమ్మకాలను నిర్వహించారు. కాగా ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ వెనుకబడుతూనే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఐటీ రంగంలో నిరాశాజనక ఫలితాలు..
ఐటీ రంగంలో నిరాశాజనక ఫలితాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి. విప్రో షేర్ ఒక్క రోజులో 7.2 శాతం పడిపోయింది. మార్చి త్రైమాసికానికి ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అధిక బ్యాడ్ లోన్ ప్రొవిజన్ల కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా దాదాపు 3 శాతం పడిపోయాయి. గత వారం నిఫ్టీ 25,899 గరిష్ట స్థాయికి చేరగా, 25,473 కనిష్ట స్థాయిని కూడా తాకింది. 25,694 వద్ద గత వారం నిఫ్టీ ముగిసింది. అయితే వీక్లీ చార్ట్‌లో స్పిన్నింగ్ టాప్ ఏర్పడటం మార్కెట్‌లో అనిశ్చితిని సూచిస్తోంది. ఈ క్రమంలోనే నిఫ్టీ 25,875 నుంచి 26,100 వరకు రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటుండగా, 25,600 ఆ తరువాత కిందకు 25,450 వద్ద కూడా సపోర్ట్‌తో కొనసాగుతోంది. అయితే ట్రంప్ టారిఫ్‌ల హెచ్చరికల ప్రభావం మార్కెట్లపై నె గెటివ్ గా పడింది. అందుకనే మార్కెట్లు పతనం అవుతున్నాయని స్పష్టమవుతోంది. కానీ ఈ భయం లేకపోతే మార్కెట్ ఇప్పుడు ఆల్ టైం హై స్థాయిలో ఉండేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






