త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Property Pulse | రియ‌ల్ రంగం అభివృద్ధికి ప్ర‌భుత్వం పూర్తి స‌హ‌కారం

Property Pulse | ప్ర‌భుత్వం తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాల వ‌ల్ల రియ‌ల్ రంగం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతోంద‌ని రెవెన్యూ, స‌మాచార శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

S

Business | Published On Mar 8, 2026, 7.51 pm IST

Property Pulse | రియ‌ల్ రంగం అభివృద్ధికి ప్ర‌భుత్వం పూర్తి స‌హ‌కారం
Advertisement

ప్రాప‌ర్టీ ప‌ల్స్ న్యూస్ పేప‌ర్‌ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి

Property Pulse | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌భుత్వం తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాల వ‌ల్ల రియ‌ల్ రంగం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతోంద‌ని రెవెన్యూ, స‌మాచార శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం స‌చివాలయంలో ఆయ‌న ప్రాప‌ర్టీ ప‌ల్స్ అనే ఆంగ్ల రియ‌ల్ ఎస్టేట్ వీక్లీ న్యూస్ పేప‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్లోబ‌ల్ క్యాప‌బిలిటీ సెంట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డంలో హైద‌రాబాద్ మిగతా న‌గ‌రాల కంటే ముందంజ‌లో ఉంద‌న్నారు. తెలంగాణ నిర్మాణ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌రికొత్త నిర్ణ‌యాల్ని తీసుకుంటుంద‌ని తెలిపారు. ఫ్యూచ‌ర్ సిటీతో హైద‌రాబాద్‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతినార్జించింద‌ని.. అనేక దేశ, విదేశీ సంస్థ‌లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల్ని పెట్టేందుకు ముందుకొస్తున్నాయ‌ని అన్నారు. న‌గ‌రానికే త‌ల‌మానికమైన మెట్రో సెకండ్ ఫేజ్, ర‌త‌న్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వంటివి అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంద‌ని తెలిపారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి రియ‌ల్ ఎస్టేట్ వీక్లీ పేప‌ర్ హైద‌రాబాద్ నుంచి ఆరంభం కావ‌డం అభినంద‌నీయమ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాప‌ర్టీ ప‌ల్స్ ఎడిట‌ర్ కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రెడాయ్ హైద‌రాబాద్ మాజీ అధ్య‌క్షుడు రాజశేఖ‌ర్‌రెడ్డి, ప‌ట్లోళ్ల కిర‌ణ్‌, గొట్టేటి రాజేష్, ప్రెస్ క్ల‌బ్ జాయింట్ సెక్ర‌ట‌రీ చిలుకూరి హ‌రిప్ర‌సాద్‌, ఈసీ స‌భ్యులు అమిత్ బ‌ట్టు, వ‌నం నాగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement