Meta Lays Offs | మెటాలో లేఫ్స్.. సరైన నిర్ణయమేనన్న ఓకులస్ ఫౌండర్ లక్కీ
Meta Lays Offs | ప్రముఖ టెక్ సంస్థ మెటా కంపెనీ ఇటీవల రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో వెయ్యికంటే మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ (VR), మెటావర్స్ నుంచి వెనకడుగు వేయడానికి సంకేతంగా పేర్కొంటున్నారు.
Meta Lays Offs | ప్రముఖ టెక్ సంస్థ మెటా కంపెనీ ఇటీవల రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో వెయ్యికంటే మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ (VR), మెటావర్స్ నుంచి వెనకడుగు వేయడానికి సంకేతంగా పేర్కొంటున్నారు. అయితే, ఓకులస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ మెటా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఈ చర్య దీర్ఘకాలంలో వీఆర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. వర్చువల్ రియాలిటీ ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న సాధారణ అభిప్రాయానికి తన దృక్పథం భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది విపత్తు కాదని.. మెటా వద్ద ఇప్పటికీ వీఆర్‌పై పెద్ద ఎత్తున బృందం పని చేస్తుందన్నారు. మరెవరూ ఆ కంపెనీకి దరిదాపుల్లో లేరని చెప్పారు. మెటా వీర నుంచి వైదొలుగుతుందనే వార్తలు అవాస్తవమన్నారు. సంఖ్యాపరంగా చెప్పాలంటే.. 15వేల మంది ఉద్యోగులతో పోలిస్తే 10శాతం తొలగింపులు అంటే.. సాధారణంగా ఆరు నెలల్లో జరిగే సిబ్బంది తగ్గింపును 60 రోజుల్లో కుదించినట్లుగా ఉందన్నారు.
రియాలిటీ ల్యాబ్స్‌లో అంచనా వేసిన 10 శాతం తొలగింపులను అతిగా చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కోత విధించడం ఖచ్చితంగా షాక్, బాధ కలిగించే విషయమేనని ఆయన అంగీకరించారు. కానీ, ఇది వీఆర్ డెవలప్‌మెంట్‌లో మెటా ఆధిపత్యాన్ని మార్చబోదన్నారు. రియాలిటీ ల్యాబ్స్ నుంచి తొలగించిన సుమారు 1,500 ఉద్యోగుల్లో ఎకు్కవ భాగం ఫస్ట్-పార్టీ కంటెంట్ టీమ్స్, మెటా సొంత గేమ్ స్టూడియోలకు సంబంధించినవి ఉన్నాయి. అవి థర్డ్-పార్టీ డెవలపర్‌లతో నేరుగా పోటీ పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ అంతర్గత పోటీ మార్కెట్‌ను వక్రీకరిస్తోందని పేర్కొన్నారు. మొత్తం పర్యావరణ వ్యవస్థను అణచివేయడం మరింత తర్కరహితమని.. చిన్న, పెద్ద డెవలపర్లు మెటా యాజమాన్యంలోని టీమ్స్‌తో పోటీ పడేందుకు చాలా కష్టపడుతున్నారని, ఎందుకంటే వారి సంపాదన సామర్థ్యానికి మించి ఆ బృందాలకు బడ్జెట్ ఉన్నాయన్నారు. పామర్ లక్కీ మెటా వీఆర్‌లో కీలక భాగంగా ఉన్నా.. పలు వివాదాలతో ఆయన 2017లో ఉద్వాసనకు గురయ్యారు. అయితే, లక్కీ, మెటా రాజీపడి, సైనిక సాంకేతిక ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






