Merritronix | డిఫెన్స్ ఫోకస్‌తో మెరిట్రానిక్స్ ఐపీవో.. జూన్ 1 నుంచి సబ్‌స్క్రిప్షన్..
Merritronix | ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) రంగంలో, ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన మెరిట్రానిక్స్ (Merritronix Ltd) తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను అధికారికంగా ప్రకటించింది.
Merritronix | ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) రంగంలో, ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన మెరిట్రానిక్స్ (Merritronix Ltd) తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను అధికారికంగా ప్రకటించింది. హై రిలయబిలిటీ ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్యం కలిగిన ఈ సంస్థ, డిఫెన్స్ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. కంపెనీ ఐపీఓకు సంబంధించిన యాంకర్ బిడ్డింగ్ మే 29న జరగనుండగా, పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 1 నుంచి జూన్ 3 వరకు కొనసాగుతుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ.141 నుంచి రూ.₹149 మధ్య నిర్ణయించారు. ఒక్క లాట్‌లో 1వేయి ఈక్విటీ షేర్లు ఉండనున్నాయి. మొత్తం ఇష్యూ సైజు సుమారు రూ.70.03 కోట్లుగా ఉంది. షేర్ అలొకేషన్ పరంగా చూస్తే యాంకర్ ఇన్వెస్టర్లకు గరిష్టంగా 13.36 లక్షల షేర్లు కేటాయించనున్నారు. క్యుఐబీలకు 8.92 లక్షల షేర్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కనీసం 6.72 లక్షల షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 15.64 లక్షల షేర్లు కేటాయించారు. మార్కెట్ మేకర్‌కు 2.36 లక్షల షేర్లు ఉంచారు.
అనేక విభాగాల్లో సేవలు..
మెరిట్రానిక్స్ కార్యకలాపాలు ప్రధానంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ఆధారపడి ఉన్నాయి. ఎఫ్‌వై 2026లో కంపెనీ మొత్తం ఆదాయంలో 97 శాతం ఈ రంగాల నుంచే వచ్చింది. ఏప్రిల్ 2026 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.9,664 లక్షలకు చేరింది. ఉత్పత్తి సామర్థ్యం పరంగా కంపెనీ ఏడాదికి మొత్తం 20.95 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 10.75 లక్షల ఎస్‌ఎమ్‌టీఈ బోర్డులు, 6 లక్షల టీహెచ్‌టీ యూనిట్లు, 4.2 లక్షల బాక్స్-బిల్డ్ యూనిట్లు ఉన్నాయి. కంపెనీకి ఈఎన్ 9100:2018 సర్టిఫికేషన్ ఉంది. అలాగే 2025లో గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సభ్యత్వాన్ని పొందింది. పాత డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌కు సంబంధించిన ఫార్మ్, ఫిట్, ఫంక్షన్ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్) రీప్లేస్‌మెంట్స్, రివర్స్ ఇంజినీరింగ్, సిస్టమ్ రీడిజైన్‌లలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. మెరిట్రానిక్స్ పూర్తి స్థాయి ఈఎంఎస్ సేవలను అందిస్తోంది. పీసీబీ డిజైన్ నుంచి బీజీఏ/మైక్రో-బీజీఏ ఎస్‌ఎమ్‌టీఈ అసెంబ్లీ, కంపోనెంట్ సోర్సింగ్, టెస్టింగ్, లాజిస్టిక్స్ వరకు ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తోంది. కంపెనీ టీఐఎఫ్‌ఆర్ ద్వారా CERN వెండర్‌గా పనిచేస్తోంది. అదేవిధంగా డిఫెన్స్, ఏరోస్పేస్ అసెంబ్లీల కోసం కస్టమ్ సెమీకండక్టర్ల అభివృద్ధిలో కూడా పాల్గొంటోంది.
ప్రభుత్వ రంగ సంస్థలతో భాగస్వామ్యం..
భారత ప్రభుత్వ ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థలతో కంపెనీకి దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఉన్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో 2009 నుంచి, హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ తో 2012 నుంచి అప్రూవ్డ్ వెండర్‌గా కొనసాగుతోంది. హనీవెల్ ఏరోస్పేస్‌కు సరఫరాలు చేయడమే కాకుండా, 2008 నుంచి యూరప్ దేశాలకు ఎగుమతులు కూడా కొనసాగిస్తోంది. మిస్సైల్ సిస్టమ్స్ కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్ అసెంబ్లీస్, ఎయిర్‌బోర్న్ రాడార్ సిస్టమ్స్ కోసం ఎలక్ట్రానిక్ అసెంబ్లీస్, డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం డిజిటల్ వీడియో రికార్డింగ్ సిస్టమ్స్ వంటి కీలక ఉత్పత్తులను సరఫరా చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దోవరి అమర్‌నాథ్ కాగా ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి సీఎస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయనకు 30 ఏళ్లకు పైగా పరిశ్రమ అనుభవం ఉంది. ఆర్థిక ఫలితాల పరంగా ఎఫ్‌వై 2026లో కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేసింది. రెవెన్యూ రూ.15,589.56 లక్షలకు చేరి ఏడాది ప్రాతిపదికన 37.28 శాతం వృద్ధి సాధించింది. ఈబీఐటీడీఏ రూ.2,721.68 లక్షలు కాగా, మార్జిన్ 17.42 శాతంగా ఉంది. ప్యాట్ రూ.1,610.30 లక్షలు నమోదు చేసి 10.33 శాతం మార్జిన్ సాధించింది. నెట్ వర్త్ రూ.5,252.28 లక్షలకు చేరగా, ఆర్‌ఓఈ 46.03 శాతంగా నమోదైంది. ఈ ఐపీఓకు జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ లిమిటెడ్ లో లిస్ట్ కానున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



