Liquor Bottles In Trains | రైళ్లలో మద్యం తీసుకెళ్లవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Liquor Bottles In Trains | రైలులో ప్రయాణించే ప్రయాణికులకు తరచుగా తలెత్తే సందేహం ఇదే. మద్యం సీసాలు తీసుకెళ్లవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతి ఉంది? ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది? అయితే ఈ విషయాలపై భారతీయ రైల్వే ఇది వరకే స్పష్టతను ఇచ్చింది. భారతీయ రైల్వే రైళ్లను ప్రజా ప్రదేశాలుగా పరిగణిస్తుంది.
Liquor Bottles In Trains | రైలులో ప్రయాణించే ప్రయాణికులకు తరచుగా తలెత్తే సందేహం ఇదే. మద్యం సీసాలు తీసుకెళ్లవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతి ఉంది? ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది? అయితే ఈ విషయాలపై భారతీయ రైల్వే ఇది వరకే స్పష్టతను ఇచ్చింది. భారతీయ రైల్వే రైళ్లను ప్రజా ప్రదేశాలుగా పరిగణిస్తుంది. ప్రయాణికుల భద్రత, శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. రైల్వే చట్టం ప్రకారం మద్యం తీసుకెళ్లడాన్ని నేరుగా నిషేధించలేదు. అయితే, ఇది పూర్తిగా ఆయా రాష్ట్రాల మద్య నిషేధ (ఎక్సైజ్) చట్టాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రయాణం ప్రారంభమయ్యే రాష్ట్రంలో మద్యం చట్టబద్ధంగా అనుమతించబడితే, అక్కడి నిబంధనల ప్రకారం మద్యం తీసుకెళ్లవచ్చు. కానీ మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నా కూడా మద్యం సీసాలు ఉంటే దాన్ని నేరంగా పరిగణిస్తారు. దేశంలో పూర్తిగా మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో గుజరాత్, బీహార్, నాగాలాండ్, లక్షద్వీప్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లేదా ఈ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో మద్యం సీసాలు పట్టుబడితే సంబంధిత రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక రైలులో గరిష్టంగా 2 లీటర్ల వరకు మద్యాన్ని తీసుకెళ్లవచ్చు. కానీ మద్యం బాటిల్ సీల్ చేసి ఉండాలి. అలాగే ప్రయాణికులు ఎట్టి పరిస్థితిలోనూ రైలులో మద్యం సేవించకూడదు. ఈ నియమాలను పాటిస్తే మద్యం బాటిళ్లను రైలులో తీసుకెళ్లవచ్చు.
రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుంది. మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో పట్టుబడితే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అరెస్టు, భారీ జరిమానా (రూ.5వేల వరకు), జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే రైలులో మద్యం తీసుకెళ్లే ముందు మీ ప్రయాణ మార్గంలో వచ్చే రాష్ట్రాల మద్య పాలసీ చట్టాలను తప్పకుండా పరిశీలించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద న్యాయ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Smoking | మీరు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతున్నారా.. అయితే పోలీసులు పట్టుకెళ్తారు జాగ్రత్త!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



