LIC | తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజ్.. ఎల్ఐసీ అందిస్తున్న ప్రత్యేక టర్మ్ పాలసీ..
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థగా పేరుగాంచింది. దేశ ప్రజలకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. అయితే చాలా వరకు పాలసీలను ఎల్ఐసీ ఏజెంట్లు కూడా విక్రయిస్తుంటారు. కానీ కొన్ని రకాల పాలసీలను మాత్రం ఎల్ఐసీ కేవలం ఆన్ లైన్‌కే పరిమితం చేసింది.
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థగా పేరుగాంచింది. దేశ ప్రజలకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. అయితే చాలా వరకు పాలసీలను ఎల్ఐసీ ఏజెంట్లు కూడా విక్రయిస్తుంటారు. కానీ కొన్ని రకాల పాలసీలను మాత్రం ఎల్ఐసీ కేవలం ఆన్ లైన్‌కే పరిమితం చేసింది. అలాంటి పాలసీల్లో న్యూ-టెక్ టర్మ్ ప్లాన్ అనే పాలసీ కూడా ఒకటి. ఇది కేవలం ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంది. ఏజెంట్లు విక్రయించడం లేదు. ఈ పాలసీ తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ లాభాలను, ఎక్కువ కవరేజి పీరియడ్‌ను అందిస్తుంది. చాలా మంది ఇప్పటికే ఈ పాలసీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. దీన్ని నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీగా ఎల్ఐసీ వినియోగదారులకు అందిస్తోంది. ఈ పాలసీని ప్రారంభించి దాదాపు ఏడాది కావస్తోంది.
కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు..
న్యూ-టెక్ టర్మ్ ప్లాన్ పాలసీలో సులభమైన ప్రీమియం చెల్లింపు విధానాలను అందుబాటులో ఉంచారు. మహిళలు, పొగ తాగని పురుషులకు ప్రత్యేక తగ్గింపు ప్రీమియంలను ఎల్ఐసీ అందిస్తోంది. అలాగే పాలసీలకు అదనంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్‌ను కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునేందుకు వినియోగదారుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. 65 ఏళ్ల వరకు వయస్సు కలిగిన వారు దీన్ని తీసుకోవచ్చు. పాలసీ కనీస కాల పరిమితి 10 ఏళ్లు కాగా గరిష్టంగా 40 ఏళ్ల వరకు కొనసాగించవచ్చు. కవరేజ్ మాత్రం వ్యక్తికి 80 ఏళ్లు వచ్చే వరకు లభిస్తుంది. చాలా ఎక్కువ కాలం పాటు కవరేజ్ ఉంటుంది కనుకనే ఈ పాలసీ పట్ల చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. పాలసీ కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు కాగా, ప్రీమియంలను వార్షికంగా లేదా 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు.
తక్కువ ఆదాయం ఉన్నవారికి మేలు..
తక్కువ ఖర్చుతో అధిక ఇన్సూరెన్స్, అధిక కవరేజి పీరియడ్ కావాలని చూస్తున్న వారికి ఈ పాలసీ ఉత్తమ ఎంపికగా మారింది. తక్కువ జీతం లేదా ఆదాయం కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. తక్కువ ప్రీమియంతోనే అధిక బీమా పొందవచ్చు. పొగ తాగనివారు, మహిళలకు డిస్కౌంట్ ఇస్తారు. ఎన్ఆర్ఐలు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునే వారు దరఖాస్తు సమయంలో ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీలలో ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్‌ను ఇవ్వాలి. చిరునామా రుజువు కింద ఆధార్, యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వవచ్చు. లేటెస్ట్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (ఫామ్ 16, పే స్లిప్స్, ఐటీఆర్) సమర్పించాల్సి ఉంటుంది.

అదనంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్..
తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ లభించడం ఈ పాలసీ ప్రత్యేకత కాగా ఇతర బీమా పథకాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిస్క్ కవరేజ్‌ను అందిస్తుంది. ప్రీమియం చెల్లింపుల్లో సింగిల్, రెగ్యులర్ లేదా లిమిటెడ్ వంటి భిన్న రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారులు ఈఎంఐ రూపంలోనూ చెల్లింపులు చేయవచ్చు. మహిళలు, నాన్ స్మోకర్లకు ప్రత్యేక ప్రీమియం రేట్లను ఇస్తున్నారు. యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ద్వారా అదనపు భద్రత లభిస్తుంది. దీని వల్ల ప్రమాద మరణం లేదా గాయాల సమయంలో కుటుంబానికి అదనపు ఆర్థిక రక్షణను ఇస్తుంది. ఈ పాలసీ కేవలం ఆన్ లైన్‌లోనే లభిస్తుంది కనుక మధ్యవర్తుల అవసరం ఉండదు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. పారదర్శకంగా పాలసీ జారీ ప్రక్రియ కొనసాగుతుంది.
రెండు రకాల ఆప్షన్‌లు..
ఈ పాలసీలో రెండు రకాల బెనిఫిట్ ఆప్షన్స్‌ను అందిస్తున్నారు. దేన్నయినా పాలసీదారులు ఎంచుకోవచ్చు. లెవల్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ కింద పాలసీ టర్మ్ మొత్తానికి సమ్ అష్యూర్డ్ ఒకేలా ఉంటుంది. ఇంక్రీస్డ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఐదేళ్ల వరకు ముందుగా ఎంచుకున్న సమ్ అష్యూర్డ్ ఉంటుంది. తరువాత ప్రతి సంవత్సరానికి 10 శాతం చొప్పున కవరేజ్ పెరుగుతుంది. ఇలా 15వ సంవత్సరం వరకు కవరేజ్ 100 శాతం పెరుగుతుంది. అంటే రెట్టింపు కవరేజ్ లభిస్తుందన్నమాట. వీటిని ఉదాహరణలుగా కూడా చూడవచ్చు.
ఉదాహరణలు చూస్తే..
20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల పాలసీ టర్మ్‌ను ఎంచుకుని ఈ పాలసీని తీసుకుంటే ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.7,047 మాత్రమే అవుతుంది. దీనికి రూ.1 కోటి వరకు కవరేజ్ లభిస్తుంది. అదే ఇంక్రీస్డ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే రూ.1 కోటి పాలసీ 15 ఏళ్ల తరువాత రూ.2 కోట్లు అవుతుంది. అంటే వయస్సు పెరిగాక కవరేజ్ ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. కానీ దీనికి అదే 20 ఏళ్ల వ్యక్తి రూ.9,345 ప్రీమియంను ఏడాదికి చెల్లించాలి. అయితే ఇక్కడ కేవలం రూ.2వేల ప్రీమియంను అదనంగా చెల్లిస్తే మరో రూ.1 కోటి ఇన్సూరెన్స్ కవరేజ్‌ను అదనంగా పొందవచ్చన్నమాట. ఇలా ఈ పాలసీ తక్కువ ఖర్చుతోనే అధిక కవరేజ్‌ను అందిస్తుంది. అయితే ఈ పాలసీల్లో తీసుకునే ఆప్షన్‌లను బట్టి, వ్యక్తుల వయస్సు ఆధారంగా కూడా ప్రీమియం రేట్లు మారుతాయి. అలాగే పాలసీలకు అందించే కవరేజ్‌లను ఎల్ఐసీ ఎప్పటికప్పుడు మారుస్తుంది. కనుక ఈ పాలసీని తీసుకునే ముందు ఒకసారి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిది. మరిన్ని వివరాలకు ఎల్ఐసీ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






