LIC | ఎల్ఐసీ అందిస్తున్న ఈ 3 పాలసీలతో పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక రకాల స్కీములు, పాలసీలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా మందికి ఇంకా అనేక పాలసీల గురించి తెలియదు. ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తు కోసం ఎలాంటి పాలసీలను తీసుకోవాలి అని సందేహిస్తుంటారు.
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక రకాల స్కీములు, పాలసీలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా మందికి ఇంకా అనేక పాలసీల గురించి తెలియదు. ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తు కోసం ఎలాంటి పాలసీలను తీసుకోవాలి అని సందేహిస్తుంటారు. ఎల్ఐసీలో ఇలాంటి పాలసీలు అనేకం ఉన్నాయి. వీటిల్లో భిన్న రకాల ప్రయోజనాలను పొందేలా పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అమ్మాయిలు ఉంటే పెద్దయ్యాక వారి పెళ్లికి లేదా పిల్లల ఉన్నత చదువులకు పనిచేసేలా ఈ పాలసీలను ఎల్ఐసీ అందిస్తోంది. వీటిల్లో కొన్ని మనీ బ్యాక్ పాలసీలు కూడా ఉన్నాయి. అయితే పిల్లల భవిష్యత్తుకు ఎల్ఐసీ అందిస్తున్న టాప్ 3 పాలసీల వివరాలు ఇలా ఉన్నాయి.
జీవన్ తరుణ్..
ఎల్ఐసీలో జీవన్ తరుణ్ (ప్లాన్ 734) అనే పాలసీ చిన్నారుల భవిష్యత్తుకు పనిచేసేలా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 0 నుంచి 12 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఏటా 20 నుంచి 25 శాతం మేర ఆదాయంలో పొదుపు చేసేలా ప్రయోజనం కూడా ఇందులో ఉంటుంది. పిల్లలకు 20 నుంచి 24 ఏళ్లు వచ్చే వరకు పాలసీ చేతికి వస్తుంది. 25 ఏళ్ల వరకు మెచూర్ అవుతుంది. తల్లిదండ్రులు మృతి చెందితే జీవితాంతం ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. కనీసం రూ.75వేలకు కూడా పాలసీ అందుబాటులో ఉంది.
న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్..
ఇక పిల్లల కోసం ఎల్ఐసీలో న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ (ప్లాన్ 732) అనే పాలసీ సైతం అందుబాటులో ఉంది. ఇది ఏటా 15-25 శాతం మేర వార్షిక పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. పిల్లలకు 18 నుంచి 22 ఏళ్ల వయస్సు వచ్చాక దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా 25వ ఏట మెచూర్ అవుతుంది. ఇందులో ఫ్లెక్సిబుల్ ప్రీమియం ఆప్షన్లు, ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. దీని వల్ల తల్లిదండ్రులు చనిపోయినా పిల్లల విద్యకయ్యే ఖర్చులకు ఇబ్బంది ఉండదు.
అమృత్‌బాల్..
ఎల్ఐసీలో అమృత్‌బాల్ (ప్లాన్ 774) పేరిట మరో పాలసీ కూడా అందుబాటులో ఉంది. ఇది పిల్లలకు భవిష్యత్తులో లంప్సమ్ మొత్తాన్ని అందిస్తుంది. అది వారి చదువులు లేదా పెళ్లికి ఉపయోగపడుతుంది. పిల్లల వయస్సు 30 రోజుల నుంచి 15 ఏళ్లు ఉంటే ఈ పాలసీ తీసుకోవచ్చు. దీనికి లైఫ్ కవర్‌తోపాటు గ్యారంటీడ్ రిటర్న్స్ కూడా లభిస్తాయి. ఇలా పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక, ఆరోగ్య భరోసా అందించేలా ఆయా పాలసీలను ఎల్ఐసీ అందిస్తోంది. వీటిని తీసుకునేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Amazon India | అమెజాన్ భారీ బెనిఫిట్స్.. డెలివరీ ఉద్యోగులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్..
మే 13, 2026

Home Loan | హోం లోన్‌ను 10 ఏళ్లు ముందుగానే ముగించాలంటే ఏం చేయాలి.. చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానం..
మే 5, 2026

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు కష్టకాలం.. వాటాలను తగ్గించుకుంటున్న సంస్థలు..
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



