త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JP Morgan | భార‌త స్టాక్ మార్కెట్ల అంచ‌నాల‌ను త‌గ్గించిన జేపీ మోర్గాన్‌.. రానున్న రోజుల్లో క‌ష్ట‌మే..?

JP Morgan | ప్ర‌ముఖ గ్లోబ‌ల్ బ్రోక‌రేజ్ సంస్థ జేపీ మోర్గాన్ భార‌త ఈక్విటీ మార్కెట్ల అంచ‌నాల‌ను ఓవ‌ర్ వెయిట్ నుంచి న్యూట్ర‌ల్‌కు త‌గ్గించింది. ఎమర్జింగ్ మార్కెట్‌ల‌తో పోలిస్తే అధిక వాల్యుయేషన్లు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఇంధ‌న స‌ర‌ఫ‌రా షాక్‌ల‌ వల్ల ఆర్థిక రంగంపై ఒత్తిడి పడుతుందని కారణాలు తెలిపింది.

S

Business | Published On Apr 25, 2026, 10.31 am IST

JP Morgan | భార‌త స్టాక్ మార్కెట్ల అంచ‌నాల‌ను త‌గ్గించిన జేపీ మోర్గాన్‌.. రానున్న రోజుల్లో క‌ష్ట‌మే..?
Advertisement

JP Morgan | ప్ర‌ముఖ గ్లోబ‌ల్ బ్రోక‌రేజ్ సంస్థ జేపీ మోర్గాన్ భార‌త ఈక్విటీ మార్కెట్ల అంచ‌నాల‌ను ఓవ‌ర్ వెయిట్ నుంచి న్యూట్ర‌ల్‌కు త‌గ్గించింది. ఎమర్జింగ్ మార్కెట్‌ల‌తో పోలిస్తే అధిక వాల్యుయేషన్లు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఇంధ‌న స‌ర‌ఫ‌రా షాక్‌ల‌ వల్ల ఆర్థిక రంగంపై ఒత్తిడి పడుతుందని కారణాలు తెలిపింది. హెచ్ఎస్‌బీసీ తన రేటింగ్‌ను తగ్గించిన ఒక రోజు తర్వాత జేపీ మోర్గాన్ ఈ నివేదిక‌ను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. పెరుగుతున్న క్రూడ్ ధరలు దేశంలో ద్రవ్యోల్బణం, వృద్ధి ప్రమాదాలను పెంచుతాయని, వినియోగాన్ని తగ్గిస్తాయని, స్వల్పకాలిక కార్పొరేట్ మార్జిన్లపై భారం పడుతుందని, బలహీనపడుతున్న రూపాయి ఒత్తిడిని మరింత పెంచుతుందని జేపీ మోర్గాన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అలాగే బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ50కి ఈ సంస్థ తన ఏడాది చివరి లక్ష్యాన్ని 10 శాతం తగ్గించి 27,000కు తీసుకువచ్చింది. జేపీమోర్గాన్ 50-స్టాక్ ఇండెక్స్ బుల్ కేస్ టార్గెట్‌ను 30,000కు తగ్గించింది, ఇది గ‌తంలో నిర్దేశించిన‌ లక్ష్యం క‌న్నా 9 శాతం తక్కువ కావ‌డం గ‌మనార్హం. బేస్ కేస్ కోసం బ్రోకరేజ్ లక్ష్యాన్ని 30,000 నుండి 27,000కు తగ్గించింది. ఇండెక్స్ బేర్ కేస్ లక్ష్యాన్ని 24,000 నుండి 20,500 కు త‌గ్గించి నివేదిక‌ను విడుద‌ల చేసింది.

ఇతర దేశాల మార్కెట్ల‌లో చ‌వ‌కైన ఎంట్రీ పాయింట్లు..

నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఏడాది వరుసగా 8.5 శాతం, 10 శాతం పడిపోయాయి. ప్రస్తుతం 2026 ప్రారంభం, 2025 చివరిలో నమోదైన రికార్డు గ‌రిష్టాల క‌న్నా వరుసగా 9.3 శాతం, 11 శాతం దిగువ‌న ట్రేడవుతున్నాయి. జేపీ మోర్గాన్‌లో ఆసియా హెడ్, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ స్ట్రాటజీ కో-హెడ్ రాజీవ్ బత్రా తెలిపిన ప్రకారం ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే భారత ప్రీమియం 109 శాతం నుండి 65 శాతానికి కుదించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇది కొంతవరకు రీ-రేటింగ్‌ను ప్రతిబింబిస్తుందని చెప్పారు. అయితే ద‌క్షిణ‌ కొరియా, బ్రెజిల్, చైనా వంటి దేశాల మార్కెట్లు ఇప్పటికీ సారూప్య లేదా మెరుగైన వృద్ధికి భారత్ క‌న్నా చ‌వ‌కైన ఎంట్రీ పాయింట్లను అందిస్తున్నాయని తెలిపారు. జేపీ మోర్గాన్ తెలిపిన‌ ప్రకారం ఇటీవల మార్కెట్ల‌లో ప‌తనం ఉన్నప్పటికీ భారత్‌ ఇప్పటికీ ద‌క్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, మెక్సికో, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్ల‌తో పోలిస్తే గణనీయమైన ప్రీమియంలో ట్రేడవుతోంద‌ని, ఇవన్నీ అధిక లేదా సారూప్య ఫార్వర్డ్ ఎర్నింగ్స్ గ్రోత్ కోసం చవకైన ఎంట్రీ పాయింట్‌ల‌ను అందిస్తాయ‌ని తెలిపారు.

భారీ ఎత్తున ప‌త‌నాన్ని అడ్డుకున్నా..

జేపీ మోర్గాన్‌లోని సెక్టార్ అనలిస్టులు కీలక రంగాలలో 2027 ఆర్థిక సంవత్సరానికి తమ ఎర్నింగ్స్ గ్రోత్ అంచనాలను 2-10 శాతం తగ్గించారు. పర్యవసానంగా వారు 2026, 2027లకు ఎంఎస్‌సీఐ ఇండియా ఎర్నింగ్స్-పర్-షేర్ గ్రోత్‌ను వరుసగా 2 శాతం, 1 శాతం తగ్గించారు. వాటిని 11 శాతం, 13 శాతానికి తీసుకువచ్చారు. కాగా రాజీవ్ బత్రా మాట్లాడుతూ దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు రికార్డు స్థాయిలో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల 37 బిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దు ఉప సంహ‌ర‌ణ‌ల‌ను కుష‌న్ చేశార‌ని, దీని వ‌ల్ల భారీ ఎత్తున ప‌త‌నాన్ని నిరోధించార‌ని అన్నారు. అయితే ఐపీఓలు (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్), క్యూఐపీలు (క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్) రూపంలో 64 బిలియన్ డాల‌ర్ల పైప్‌లైన్, ప్రమోటర్ సేల్స్‌తోపాటు, ఇప్పటికే ఉన్న హోల్డర్లను డైల్యూట్ చేస్తున్నాయ‌ని, అప్ సైడ్ ను పరిమితం చేస్తున్నాయని అన్నారు. ఇది అమెరికా మార్కెట్ల‌కు పూర్తి విరుద్ధంగా ఉంద‌ని, అక్కడ బైబ్యాక్‌లు నిరంతరం ఈక్విటీని రిటైర్ చేస్తాయ‌ని తెలిపారు.

స్వ‌ల్ప‌కాలిక వృద్ధి బ‌ల‌హీనంగానే..

భారత్‌లో ఏఐ, డేటా సెంటర్లు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు వంటి అధిక-వృద్ధి థీమ్‌ల‌కు అర్థపూర్వక ఎక్స్ పోజర్ లేదని, ఇది ఈ సెగ్మెంట్లలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఎమర్జింగ్ మార్కెట్ల‌తో పోలిస్తే ఎర్నింగ్స్ గ్రోత్‌ను పరిమితం చేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్‌ తెలిపింది. మార్కెట్ డైల్యూషన్‌ను ఆ సంస్థ మరో పెరుగుతున్న సవాలుగా గుర్తించింది. బలమైన దేశీయ ప్రవాహాలు ఫారిన్ సెల్లింగ్‌ను కుషన్ చేసినప్పటికీ, టాప్ షేర్ హోల్డర్ల ద్వారా వాటాల విక్రయాలు, ఐపీవోలు, క్యూఐపీల ద్వారా రికార్డు స్థాయి ఇష్యూ ఈక్విటీ మార్కెట్ లాభాలను పరిమితం చేస్తున్నాయ‌ని తెలియ‌జేసింది. భార‌త దీర్ఘకాలిక వృద్ధి ల‌క్ష్యం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని జేపీ మోర్గాన్ చెప్పినప్పటికీ స్వల్పకాలిక వృద్ధి మాత్రం బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం న‌మోద‌వుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెల‌ప‌డం కూడా జేపీ మోర్గాన్ త‌న అంచ‌నాల‌ను త‌గ్గించ‌డానికి ఒక కార‌ణ‌మ‌ని వెల్ల‌డైంది. అయితే ఫైనాన్షియల్స్, మెటీరియల్స్, కన్‌జ్యూమర్ డిస్క్రిపిషనరీ, హాస్పిటల్స్, డిఫెన్స్, పవర్‌తో సహా ఆయా సెక్టార్లపై ప్ర‌భావం ఉండొచ్చ‌ని, ఇవి ఓవ‌ర్‌వెయిట్‌గా ఉన్నాయని, ఐటీ, ఫార్మా అండ‌ర్ వెయిట్‌గా ఉన్నాయ‌ని జేపీ మోర్గాన్ స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement