త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold ETFs | గోల్డ్ ETFs లో భారీగా పెరిగిన పెట్టుబ‌డులు.. మార్చి త్రైమాసికంలో 36 శాతం పెరుగుద‌ల‌..

Gold ETFs | భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గుచూపడంతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2026 మార్చి త్రైమాసికంలో గోల్డ్ ETFs‌లో మొత్తం రూ.31,561 కోట్ల ఇన్‌ఫ్లో నమోదై, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 6 రెట్లు పెరిగింది.

S

Business | Published On Apr 14, 2026, 5.00 pm IST

Gold ETFs | గోల్డ్ ETFs లో భారీగా పెరిగిన పెట్టుబ‌డులు.. మార్చి త్రైమాసికంలో 36 శాతం పెరుగుద‌ల‌..
Advertisement

Gold ETFs | భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గుచూపడంతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2026 మార్చి త్రైమాసికంలో గోల్డ్ ETFs‌లో మొత్తం రూ.31,561 కోట్ల ఇన్‌ఫ్లో నమోదై, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 6 రెట్లు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇన్‌ఫ్లోలు 36 శాతం పెరిగి రూ.23,132 కోట్లకు చేరుకున్నాయి. అలాగే గోల్డ్ ETFs ఆస్తుల పరిమాణం (AUM)తోపాటు పెట్టుబడిదారుల ఖాతాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మార్చి నెలలో మాత్రమే రూ.2,266 కోట్ల నికర ఇన్‌ఫ్లో నమోదైంది. ఇది ఫిబ్రవరిలో నమోదైన రూ.5,255 కోట్లు, జనవరిలో నమోదైన రూ.24,040 కోట్లతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ, మొత్తం త్రైమాసికానికి గణనీయమైన వృద్ధి సాధించింది.

కొన‌సాగుతున్న పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి..

అసోసియేష‌న్ ఆఫ్ మ్యుచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం 2026 మార్చి త్రైమాసికంలో మొత్తం ఇన్‌ఫ్లో రూ.31,561 కోట్లకు చేరగా, 2025 లో ఇదే కాలంలో అది రూ.5,654 కోట్లుగా మాత్రమే న‌మోదైంది. మాస ప్రాతిపదికన ఇన్‌ఫ్లోలు కొంత తగ్గినా బంగారం ఆధారిత పెట్టుబడులపై ఆసక్తి కొనసాగుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. జనవరిలో అత్యధిక ఇన్‌ఫ్లోలు నమోదవడం, పెట్టుబడిదారుల రిస్క్ భయం, పోర్ట్‌ఫోలియో సర్దుబాట్లు, బంగారం ధరల పెరుగుదల వంటి కారణాలు తదుపరి నెలల్లో సంఖ్యలు తక్కువగా కనిపించడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈక్విటీల వైపు మొగ్గు చూపినందువ‌ల్లే..

మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ మాట్లాడుతూ మార్చిలో కూడా సానుకూల ఇన్‌ఫ్లోలు కొనసాగడం గోల్డ్ ఇంకా మార్కెట్ అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు ఒక భద్రమైన ఎంపికగా కొనసాగుతోందని సూచిస్తుందని తెలిపారు. ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో ఉమేష్ శర్మ ప్రకారం మార్చిలో ఇన్‌ఫ్లోలు తగ్గడానికి కారణం ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే బంగారం విలువలు కొంత అధికంగా ఉండడం వల్ల పెట్టుబడిదారులు ఈక్విటీలవైపు మళ్లినట్లు కనిపిస్తోందని అన్నారు. ఈ భారీ ఇన్‌ఫ్లోలతో గోల్డ్ ETFs ఆస్తుల పరిమాణం (AUM) దాదాపు మూడు రెట్లు పెరిగి 2026 మార్చి నాటికి రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే సమయంలో ఇది రూ.58,888 కోట్లుగా ఉంది.

భారీగా పెరిగిన ఫోలియోల సంఖ్య‌..

బంగారం గత కొన్ని సంవత్సరాల్లో మంచి రాబడులు ఇవ్వడంతో పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా ఫోలియో సంఖ్యలు కూడా పెరిగాయి. 2025 మార్చిలో 69.69 లక్షలుగా ఉన్న ఫోలియోలు, 2026 మార్చికి 54.28 లక్షల పెరుగుదలతో 1.24 కోట్లకు చేరాయి. మెష్రామ్ ప్రకారం గోల్డ్ ETFs పెట్టుబడిదారులకు లిక్విడిటీ, పారదర్శకత, సౌలభ్యం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు, నిల్వ వంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఇవి కల్పిస్తాయి. 2026 మొదటి త్రైమాసికంలో రూ.31,561 కోట్ల ఇన్‌ఫ్లో నమోదవడం, నెలవారీ తగ్గుదల ఉన్నప్పటికీ మొత్తం కాలానికి బలమైన పనితీరును సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. గోల్డ్ ఇప్పటికీ పెట్టుబడిదారులకు రిస్క్ హెడ్జ్‌గా, దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతోందని ఆమె అన్నారు.

దీర్ఘ‌కాలిక ఆర్థిక స్థిర‌త్వం..

గోల్డ్ ETFs అనేవి దేశీయ బంగారం ధరలను అనుసరించే పాసివ్ పెట్టుబడి సాధనాలు. ఇవి బంగారం బులియన్‌లో పెట్టుబడి పెడతాయి. ప్రతి యూనిట్ సుమారు ఒక గ్రాము బంగారాన్ని సూచిస్తుంది. పేపర్ లేదా డీమాట్ రూపంలో లభించే ఈ యూనిట్లు అధిక స్వచ్ఛత క‌లిగిన‌ భౌతిక బంగారంతో స‌మానంగా ఉంటాయి. స్టాక్‌ల మాదిరిగా ట్రేడింగ్ సౌలభ్యంతోపాటు స‌ర‌ళమైన పెట్టుబ‌డి విధానాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తాయి. అందుక‌నే చాలా మంది పెట్టుబ‌డిదారు గోల్డ్ ETFs ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. ముఖ్యంగా యుద్దం లేదా కోవిడ్ వంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు ఇవి సేఫ్ హావెన్ ఆస్తిగా నిలుస్తాయి. ప్ర‌జ‌ల‌కు దీర్ఘ‌కాలిక ఆర్థిక స్థిర‌త్వంపై భ‌రోసాను క‌ల్పిస్తాయి.

Advertisement
Advertisement