Stocks | ఈ 8 స్టాక్స్‌లో భారీగా పెరిగిన కొనుగోళ్లు.. పెట్టుబడిదారుల ఆసక్తి..
Stocks | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలు వెలువడడంతోపాటు చమురు ధరలు తగ్గడం, భారత రూపాయి విలువ పెరగడం వంటి పలు కారణాల వల్ల పలు దేశీయ స్టాక్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే గత వారం రోజుల వ్యవధిలో టాప్ 10 అత్యధిక విలువ కలిగిన కంపెనీలలో 8 సంస్థల మార్కెట్ విలువ మొత్తం కలిపి రూ.1,87,497.45 కోట్లు పెరిగింది.
Stocks | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలు వెలువడడంతోపాటు చమురు ధరలు తగ్గడం, భారత రూపాయి విలువ పెరగడం వంటి పలు కారణాల వల్ల పలు దేశీయ స్టాక్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే గత వారం రోజుల వ్యవధిలో టాప్ 10 అత్యధిక విలువ కలిగిన కంపెనీలలో 8 సంస్థల మార్కెట్ విలువ మొత్తం కలిపి రూ.1,87,497.45 కోట్లు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్ ఈ సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈక్విటీ మార్కెట్లలో గత వారం, పది రోజులుగా పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుండడంతో ఈ వృద్ధి చోటు చేసుకుంది.
శాంతి ఒప్పందంపై ఆశావాదం..
గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 943.29 పాయింట్లు (1.21 శాతం) పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 302.95 పాయింట్లు (1.25 శాతం) లాభ పడింది. రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ జియోపొలిటికల్ ఉద్రిక్తతలు తగ్గడం, రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వల్ల మార్కెట్లు వరుసగా రెండో వారంలో కూడా లాభాలతో ముగిశాయన్నారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఉన్న ఆశావాదం మార్కెట్ నమ్మకాన్ని పెంచిందని, దేశీయ ఆర్థిక ప్రాతిపదిక కూడా స్థిరంగా ఉండటం వల్ల మార్కెట్ జోరు కొనసాగిందని తెలిపారు.
టాప్ లో భారతీ ఎయిర్‌టెల్..
కాగా అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.58,831.52 కోట్లు పెరిగి రూ.11,25,125.21 కోట్లకు చేరింది. ఇది టాప్-10 కంపెనీలలో అత్యధిక పెరుగుదలగా నమోదైంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ రూ.27,608.62 కోట్లు పెరిగి రూ.5,32,691.31 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.20,731.64 కోట్లు పెరిగి, మార్కెట్ విలువ రూ.9,34,063.56 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,231.05 కోట్లు పెరిగి రూ.18,47,317.84 కోట్లకు చేరగా, ఎల్ అండ్ టీ విలువ రూ.18,577.91 కోట్లు పెరిగి రూ.5,63,314.50 కోట్లకు చేరింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ రూ.18,266.82 కోట్లు పెరిగి రూ.9,65,008.67 కోట్లకు చేరగా, ఎస్‌బీఐ విలువ రూ.12,599.79 కోట్లు పెరిగి రూ.9,97,229.77 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.10,650.1 కోట్లు పెరిగి రూ.5,34,774.50 కోట్లకు చేరింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,163.04 కోట్లు తగ్గి రూ.12,31,315.53 కోట్లకు పడిపోయింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.9,769.3 కోట్లు తగ్గి రూ.5,65,437.17 కోట్లకు చేరింది.
మార్కెట్ విలువ పరంగా రిలయన్స్..
మొత్తం మార్కెట్ విలువ పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. దాని తరువాత వరుసగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ నిలిచాయి. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ స్టాక్స్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుతం మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తుండడంతో పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్ ఫండ్స్ పట్ల మొగ్గు చూపుతున్నారు. అయితే యుద్ధం పూర్తిగా ముగుస్తుందా, లేదా అన్న విషయంపైనే మార్కెట్ దిశ ఆధార పడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



