Step Up SIP | నెలకు రూ.5000 పెట్టుబడి పెడితే రూ.6 కోట్లు కూడబెట్టడం సాధ్యమే.. ఎలాగో వివరిస్తున్న సీఏ..
Step Up SIP | మ్యుచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక సాధనాలు. కానీ కొందరు మ్యుచువల్ ఫండ్స్ లో డబ్బు పెట్టగానే లాభాలు రావడం లేదని వాపోతుంటారు. స్వల్పకాలిక లక్ష్యాల కన్నా దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇవి మేలు చేస్తాయి.
Step Up SIP | మ్యుచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక సాధనాలు. కానీ కొందరు మ్యుచువల్ ఫండ్స్ లో డబ్బు పెట్టగానే లాభాలు రావడం లేదని వాపోతుంటారు. స్వల్పకాలిక లక్ష్యాల కన్నా దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇవి మేలు చేస్తాయి. అయితే చాలా ఏళ్లపాటు మ్యుచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డబ్బును పొదుపు చేస్తే సంపదను సృష్టించడం నిజంగా సాధ్యమేనా అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. అందుకనే అధిక శాతం మంది సిప్‌లను చాలా ఏళ్ల పాటు కొనసాగించలేకపోతుంటారు. మధ్యలోనే పెట్టుబడులను విరమించుకుంటారు. అయితే నెలకు కేవలం రూ.5వేల స్టెప్ అప్ సిప్‌తో రూ.6 కోట్ల సంపదను సృష్టించడం నిజంగానే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సీఏ నితిన్ కౌశిక్ తన ఎక్స్ ఖాతాలో వివరాలను వెల్లడించారు. ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చెప్పిన ఆయన చిన్న మొత్తంతోనే కోట్ల సంపదను ఎలా సృష్టించవచ్చో వివరించారు.
రూ.5000 సిప్‌తో రూ.6 కోట్లు..
సాధారణ ఎస్ఐపీ (సిప్) కంటే స్టెప్-అప్ ఎస్ఐపీ మరింత ప్రయోజనకరం. ఉదాహరణకు మీరు నెలకు రూ5,000తో ఎస్ఐపీ ప్రారంభించి ప్రతి సంవత్సరం దానిని 10 శాతం పెంచితే, రెండో సంవత్సరం అది రూ.5,500 అవుతుంది. ఈ విధంగా 30 సంవత్సరాలు కొనసాగిస్తే, సగటున 12 శాతం వార్షిక రాబడితో మీ సంపద దాదాపు రూ.6 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది. చిన్న 10 శాతం పెంపు కూడా దీర్ఘకాలంలో భారీ ఫలితాలను ఇస్తుంది. చిన్న మొత్తాలు కూడా కాలక్రమంలో భారీ సంపదగా మారుతాయని కౌశిక్ చెబుతున్నారు. నెలకు రూ.2,000 సేవ్ చేస్తే దీర్ఘకాలంలో అది రూ.2 కోట్లకు చేరే అవకాశాలు ఉంటాయి. అదే రూ.20,000 నెలవారీ పెట్టుబడి ఉంటే, అది రూ.22 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన అంశం క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడమే. అలాగే సమయాన్ని కూడా కేటాయించాలి.
ఇలా లెక్కిస్తే సాధ్యమే..
నెలకు రూ.5000 చొప్పున సిప్‌లో పెట్టుబడి పెట్టడంతోపాటు ఏడాదికి దాన్ని 10 శాతం చొప్పున పెంచుతూ పోతే అప్పుడు 33 ఏళ్ల కాల వ్యవధిలో పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.1,33,35,093 అవుతుంది. దీనికి ఏటా 12 శాతం వార్షిక రాబడిని కలపడంతోపాటు కాంపౌడింగ్ శక్తి కారణంగా మొత్తం ఆ కాలవ్యవధిలో రూ.4,68,79,305 వస్తుంది. దీంతో చేతిలో మొత్తం కలిపి రూ.6,02,14,397 ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు సిప్‌లో పెట్టుబడి పెడితే భారీగా సంపదను సృష్టించడం సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది. అయితే 33 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలంటే వయస్సు 30 లేదా 35 దాటాక పెడితే కుదరదు. 20లలో ఉన్నప్పుడే పెట్టుబడి ప్రారంభించాలి. అందుకనే చిన్న మొత్తం అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే పెట్టుబడులు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
సమయం అత్యంత కీలకం..
చాలామంది పెద్ద లక్ష్యాలను ఆలోచిస్తూ పెట్టుబడిని ప్రారంభించడమే ఆలస్యం చేస్తారు. కౌశిక్ సూచన ఏమిటంటే.. మీ దగ్గర ఉన్న డబ్బుతో వెంటనే ప్రారంభించాలి. పెద్ద మొత్తాన్ని ఎదురు చూడకుండా చిన్న మొత్తంతో మొదలుపెట్టడం మంచిదని ఆయన స్పష్టం చేశారు. స్టార్టింగ్ ఎర్లీ బీట్స్ స్టార్టింగ్ బిగ్.. అంటే పెద్ద మొత్తంతో ఆలస్యంగా ప్రారంభించడం కంటే చిన్న మొత్తంతో ముందుగానే ప్రారంభించడం మంచిది. ప్రతి సంవత్సరం 10 శాతం పెట్టుబడిని పెంచడం మధ్యతరగతికి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌లో సమయం అత్యంత కీలకం. చిన్న మొత్తంతో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ పోతే, కాంపౌండింగ్ శక్తి ద్వారా పెద్ద సంపదను సృష్టించవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించడం ఉత్తమ నిర్ణయం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



