Stocks | యుద్ధం ముగిస్తే ఈ షేర్లలో భారీగా లాభాలు వచ్చే చాన్స్.. నిపుణుల సూచన..
Stocks | పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీగా పతనం అవగా, అసలు విషయం ఇంకా ముగియలేదని, త్వరలోనే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సుదీప్ బంధోపాధ్యాయ్ హెచ్చరించారు. దేశీయ సూచీలు పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నాయని, కానీ భవిష్యత్తులో ప్రమాదం ఉందని అన్నారు.
Stocks | పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీగా పతనం అవగా, అసలు విషయం ఇంకా ముగియలేదని, త్వరలోనే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సుదీప్ బంధోపాధ్యాయ్ హెచ్చరించారు. దేశీయ సూచీలు పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నాయని, కానీ భవిష్యత్తులో ప్రమాదం ఉందని అన్నారు. సూచీలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని తెలిపారు. అత్యంత తీవ్రమైన పరిణామాలు మార్కెట్‌లో ఇంకా సంభవించలేదని, డేటా ఆధారంగా కాకుండా కేవలం ఆశతో పెట్టుబడిదారులు వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మార్కెట్లు ప్రస్తుతం అంచనా వేస్తున్న దాని కన్నా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు.
మార్కెట్లు ఇప్పటికప్పుడు కోలుకోవడం కష్టమే..
ప్రస్తుతం చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువలో ఉందని, అలాగే పతనమవుతున్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారిందని సుదీప్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణలు ముగిసిపోతాయని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారని, అయిదే అందులో కాస్త నిజం ఉన్నా ఇప్పటికప్పుడు మార్కెట్లు కోలుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా వివరాలను వెల్లడించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 95కి పడిపోవడం, కొనసాగుతున్న పశ్చిమ ఆసియా యుద్ధం ఉద్రిక్తతలు వంటి అంశాల కారణంగా చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుఉంటుందని, దీని వల్ల భారత ఈక్విటీలపై ఒత్తిడి పడుతుందన్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ప్రతికూల అంశాలతో పతనమవుతున్నాయని, దీనికి తోడు ఐఎండీ, స్కైమెట్ రెండూ అంచనా వేసి ఎల్‌నినో ప్రేరిత రుతుపవనాల లోటు కూడా తోడైందని, దీని వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు.
లార్జ్ క్యాప్ మేలు..
అయితే భౌగోళిక ఉద్రిక్తతలకు త్వరగా పరిష్కారం లభిస్తే మార్కెట్లు భారీగా పతనం అవకుండా ఆపవచ్చని అన్నారు. ఇక కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు మళ్లీ అధికారంలోకి వస్తారు.. అన్న అంశంపై కూడా మార్కెట్ల భవితవ్యం ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. అయితే పెట్టుబడిదారులు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తిగా డబ్బులు పెట్టొద్దని లేదా ట్రేడ్ చేయవద్దని చెప్పనని, కానీ దీర్ఘకాలిక దృష్టి ఉన్నవారు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా విడతలవారీగా పెట్టుబడులు పెడితే మంచిదని అన్నారు. ఇక్కడి నుంచి సూచీలు ఇంకా కిందకు ఎంతగా పతనమవుతాయో ఎవరూ చెప్పలేరని, కానీ నెమ్మదిగా కొనుగోలు చేయాలని, 10 నుంచి 20 శాతం మేర మాత్రమే కొనుగోళ్లు చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. రిస్క్‌కు దూరంగా ఉండాలనుకుంటే మిడ్, స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్‌లలో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.
ఈ స్టాక్స్‌ను ట్రాక్ చేయండి..
ఇక సుదీప్ బంధోపాధ్యాయ్ పలు స్టాక్‌లను కూడా పెట్టుబడిదారులకు రికమెండ్ చేస్తున్నారు. వాటిని ఒక కంట కనిపెట్టి ఉండాలని అన్నారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, మ్యాన్‌కైండ్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లను తాను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి ప్రస్తుతం దీర్ఘకాల పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉన్నాయని, సరైన టైములో కొనుగోలు చేస్తే మంచి లాభాలను పొందవచ్చని తెలిపారు. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో వస్తే రిలయన్స్ షేర్లకు మంచి ఊపు ఉంటుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు దిగువనే ఉండాలని, అప్పటి వరకు పెట్టుబడిదారులు ఎన్నికలను పట్టించుకోకుండా లార్జ్ క్యాప్ వంటి స్టాక్‌లను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



