త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | నెగెటివ్‌గా ఓపెన్ అయినా.. లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉద‌యం మార్కెట్లు నెగెటివ్ గా ఓపెన్ అయిన‌ప్ప‌టికీ కాసేప‌టికి ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో రిక‌వ‌ర్ అయి చివ‌ర‌కు లాభాల్లో స్థిర ప‌డ్డాయి. నిఫ్టీ50 సూచీ 120 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయి త‌రువాత 22,724 ఇంట్రాడే క‌నిష్టాన్ని తాకింది.

S

Business | Published On Apr 7, 2026, 4.05 pm IST

Stock Markets | నెగెటివ్‌గా ఓపెన్ అయినా.. లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉద‌యం మార్కెట్లు నెగెటివ్ గా ఓపెన్ అయిన‌ప్ప‌టికీ కాసేప‌టికి ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో రిక‌వ‌ర్ అయి చివ‌ర‌కు లాభాల్లో స్థిర ప‌డ్డాయి. నిఫ్టీ50 సూచీ 120 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయి త‌రువాత 22,724 ఇంట్రాడే క‌నిష్టాన్ని తాకింది. అనంత‌రం 420 పాయింట్లు ఎగ‌బాకి లాభాల్లో ముగిసింది. నిఫ్టీ50 సూచీ క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే 155.40 పాయింట్లు (0.68 శాతం) లాభ‌ప‌డి 23,123.65 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 341 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో ప్రారంభమై 73,288 ఇంట్రా డే క‌నిష్టాన్ని తాకింది. త‌రువాత 1412 పాయింట్ల మేర రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే 509.73 పాయింట్లు (0.69 శాతం) లాభ‌ప‌డి 74,616.58 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన సంప‌ద‌..

ప్రధాన సూచీలు మంచి లాభాలు నమోదు చేసినప్పటికీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయాయి. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ కేవలం 0.03 శాతం మాత్రమే పెరిగింది. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 0.16 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఇక మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో మార్కెట్లు పాజిటివ్‌గా ముగియ‌డంతో పెట్టుబ‌డిదారుల సంప‌ద పెరిగింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో ఉన్న సుమారు రూ.427.50 లక్షల కోట్ల నుంచి పెరిగి రూ.429 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.1.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గ‌త నాలుగు సెష‌న్ల‌లోనూ సూచీలు లాభాల‌నే న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 2,669 పాయింట్లు (3.71 శాతం) పెరగ్గా, నిఫ్టీ50 సూచీ 792 పాయింట్లు (3.55 శాతం) లాభ‌ప‌డింది.

స్వ‌ల్పంగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ధరలు ఎగువ స్థాయిలో ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత స్టాక్స్‌ను విక్రయించడం కొనసాగించినప్పటికీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.70 డాల‌ర్లు త‌గ్గి 106 వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.60 డాల‌ర్లు త‌గ్గి 103 వ‌ద్ద కొన‌సాగింది. అయితే వ‌రుస‌గా నాలుగో రోజు కూడా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో అవి రిక‌వ‌ర్ అవుతున్నాయా.. అనే సందేహం పెట్టుబ‌డిదారుల్లో వ‌స్తోంది. కానీ యుద్ధం ముగియ‌లేదు క‌నుక అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

భారీగా లాభ‌ప‌డ్డ ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు..

మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో ల‌క్స్ ఇండ‌స్ట్రీస్ సంస్థ షేర్లు 10.56 శాతం పెరిగి టాప్ గెయిన‌ర్ల జాబితాలో తొలి స్థానంలో నిల‌వ‌గా, త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా కోర‌మాండ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌, అలెంబిక్ ఫార్మాసూటిక్స్ లిమిటెడ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లు నిలిచాయి. అలాగే జూబిలియంట్ ఫుడ్ వ‌ర్క్స్ లిమిటెడ్ షేర్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. 10.49 శాతం మేర ఈ సంస్థ షేర్లు ప‌త‌నం అవ‌డంతో టాప్ లూజ‌ర్ల జాబితాలో ఈ సంస్థ నిలిచింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా బ‌యోకాన్ లిమిటెడ్‌, ఓరియంట్ ఎల‌క్ట్రిక్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు నిలిచాయి. ప్ర‌ధానంగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్ రంగానికి చెందిన షేర్లు లాభ‌ప‌డ్డాయి.

Advertisement
Advertisement