త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌చ్చే వారం స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గానే..? వార్త‌లు వ‌స్తేనే న‌ష్టం..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు రెండు వరుస వారాల బలమైన లాభాల తర్వాత ఈ వారం స్వల్ప విరామం తీసుకున్నాయి. వారాంతంలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, భౌగోళిక‌ ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో నిఫ్టీ50 సూచీ 23,900 స్థాయి దిగువకు చేరింది.

S

Business | Published On Apr 26, 2026, 1.20 pm IST

Stock Markets | వ‌చ్చే వారం స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గానే..? వార్త‌లు వ‌స్తేనే న‌ష్టం..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు రెండు వరుస వారాల బలమైన లాభాల తర్వాత ఈ వారం స్వల్ప విరామం తీసుకున్నాయి. వారాంతంలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, భౌగోళిక‌ ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో నిఫ్టీ50 సూచీ 23,900 స్థాయి దిగువకు చేరింది. మొత్తం మీద 1.87 శాతం నష్టాన్ని నమోదు చేసింది. లివ్‌లాంగ్ వెల్త్ వ్యవస్థాపకుడు, సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ హ‌రిప్ర‌సాద్.కె తెలిపిన ప్ర‌కారం సోమవారం మార్కెట్లు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌న్నారు. విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలు సుమారు 180 పాయింట్ల పెరుగుదలను సూచిస్తున్నాయ‌ని తెలిపారు. అయితే వీకెండ్‌లో జరిగే అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఈ ట్రెండ్ మారే అవ‌కాశ‌మూ ఉంద‌న్నారు. మార్కెట్ ప్రస్తుతం అధిక వోలాటిలిటీతో కూడిన కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంద‌ని, క్రూడ్ ఆయిల్ ధరల స్థిరత్వం, భౌగోళిక‌ పరిణామాల స్పష్టత, ప్రధాన కంపెనీల ఎర్నింగ్స్ ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయ‌ని తెలిపారు.

సెన్సెక్స్‌, నిఫ్టీ50 కీల‌క స్థాయిలు ఇవే..

బీఎస్ఈ సెన్సెక్స్ ఈ వారం 1,829 పాయింట్లు (2.33 శాతం) పడిపోయి బలహీనతను చూపింది. టెక్నికల్‌గా 77,000 స్థాయి కీలక రెసిస్టెన్స్‌గా మారింది. ఈ స్థాయిని దాటితేనే బలమైన బుల్లిష్ రివర్సల్ సంకేతాలు కనిపిస్తాయి. పై స్థాయిలో 77,500 వద్ద మరింత రెసిస్టెన్స్ ఉండగా, దిగువన 76,500 కీలక సపోర్ట్‌గా ఉంది. ఈ స్థాయి కంటే దిగువకు పడితే 76,000 వరకు క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ అనలిస్ట్ ఆకాష్ షా తెలిపిన ప్రకారం నిఫ్టీ ప్రారంభంలో స్థిరంగా ఉండి 24,601.70 వరకు చేరినా, ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింద‌ని తెలిపారు. పైవైపు 24,000, 24,150, 24,350 స్థాయిలు రెసిస్టెన్స్‌గా ఉండగా, దిగువన 23,800, 23,700 సపోర్ట్ స్థాయిలుగా ఉన్నాయ‌ని అన్నారు. 23,500 దిగువకు పడిపోతే మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడర్లు కఠిన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.

సానుకూలంగా ఉండే అవ‌కాశం..

ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వారం స్థిరంగా ప్రారంభమై 57,456 స్థాయికి చేరినా, అక్కడి నుంచి క్షీణించింది. వీక్లీ ఆర్ఎస్ఐ 47.75 వద్ద ఉండటం వల్ల మార్కెట్ మొమెంటమ్ న్యూట్రల్ నుంచి స్వల్పంగా బేరిష్‌గా ఉందని సూచిస్తోంది. పైన ఉన్న స్థాయిలను తిరిగి అందుకోలేకపోతే షార్ట్‌టర్మ్ కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ట్రేడర్లు కీలక స్థాయిలను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ వచ్చే వారం ప్రారంభం సానుకూలంగా ఉండే అవకాశముంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు, గ్లోబల్ పరిణామాలు, కంపెనీల ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్న కీలక అంశాలుగా మారనున్నాయి.

Advertisement
Advertisement