త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రాఫిట్ బుకింగే కార‌ణం..?

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిశాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పెట్టుబ‌డిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు య‌త్నించ‌డంతో అమ్మ‌కాలు చోటు చేసుకున్నాయి.

S

Business | Published On May 7, 2026, 4.01 pm IST

Stock Markets | స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రాఫిట్ బుకింగే కార‌ణం..?
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిశాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పెట్టుబ‌డిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు య‌త్నించ‌డంతో అమ్మ‌కాలు చోటు చేసుకున్నాయి. అయితే మార్కెట్లు మ‌రీ ప‌త‌నం కాకుండా కొనుగోళ్లు కుష‌న్ చేశాయి. హిందుస్థాన్ యూనిలివ‌ర్ లిమిటెడ్‌, టీసీఎస్‌, ఐటీసీ, రిల‌య‌న్స్ వంటి సంస్థ‌ల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున ప్రాఫిట్ బుకింగ్‌కు య‌త్నించారు. అమ్మ‌కాలు, కొనుగోళ్ల మ‌ధ్య మార్కెట్లు మొత్తంగా ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు (0.15 శాతం) త‌గ్గి 77,844.52 వద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 4.30 పాయింట్లె (0.02 శాతం) త‌గ్గి 24,326.65 వద్ధ స్థిర‌ప‌డింది.

సెంటిమెంట్ పాజిటివ్‌గానే..

అయితే ప్ర‌ధాన సూచీలు న‌ష్టాల్లో ముగిసినప్ప‌టికీ విస్తృత స్థాయి సూచీలు మాత్రం భారీగా లాభ‌ప‌డ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250 సూచీలు ఒక్కొక్క‌టి 1 శాతానికి పైగా పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో, మెట‌ల్‌, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా లాభ‌ప‌డగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియాల్టీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గుర‌య్యాయి. ఇక నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్ సూచీలు కాస్త బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాయి. అయితే మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిసిన‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ మాత్రం పాజిటివ్‌గానే ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. గురువారం సూచీల క‌ద‌లిక ప్ర‌ధానంగా ప్రాఫిట్ బుకింగ్ వ‌ల్లే చోటు చేసుకుంద‌ని అంటున్నారు. అయితే వ‌చ్చే సెష‌న్ల‌లో మార్కెట్ల దిశ ఎలా ఉంటుంద‌న్నది కీల‌క‌మ‌ని తెలిపారు.

బ‌ల‌ప‌డ్డ రూపాయి, త‌గ్గిన చమురు ధ‌ర‌లు..

అమెరికా సూచీలు సైతం స్వ‌ల్ప ఒడిదుడుల‌కు గుర‌వ్వ‌గా ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ 100 ఫ్యూచ‌ర్స్ కాస్త ఒత్తిడికి లోన‌య్యాయి, వాటిల్లో స్వ‌ల్ప హెచ్చు త‌గ్గులు చోటు చేసుకున్నాయి. ఇక డౌజోన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ యావ‌రేజ్ ఫ్యూచ‌ర్స్ 0.1 శాతం మేర లాభ‌ప‌డ్డాయి. ఆసియా ప‌సిఫిక్ సూచీ ఎంఎస్‌సీఐ 2.1 శాతం ఎగ‌బాక‌గా, ఎంఎస్సీఐ ఎమ‌ర్జింగ్ మార్కెట్స్ సూచీ 1.5 శాతానికి పైగా లాభ‌ప‌డింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. ఉద‌యం సెష‌న్‌లో రూపాయి విలువ ప‌త‌న‌మైనా మ‌ళ్లి పుంజుకుని డాల‌ర్‌కు పోటీగా నిలిచింది. దీంతో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ 36 పైస‌లు పెరిగి డాల‌ర్‌కు 94.24 వ‌ద్ద నిలిచింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో వ‌చ్చిన పాజిటివ్ సంకేతాల‌తో చ‌మురు ధ‌ర‌లు కూడా ప‌త‌న‌మ‌య్యాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 3.46 శాతం త‌గ్గి 98 డాల‌ర్ల‌కు చేర‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 3.35 శాతం ప‌త‌న‌మై 89 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది.

నాలుగో త్రైమాసిక ఫ‌లితాలు పూర్త‌యితే..

అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండ‌డం, చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం, రూపాయి విలువ పెర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వాస్త‌వానికి సూచీలు లాభాల్లో ముగియాలి. ఆనీ నాలుగో త్రైమాసిక ఫ‌లితాల ప్ర‌క‌ట‌న కార‌ణంగా అనేక కంపెనీల‌కు చెందిన స్టాక్స్‌ను పెట్టుబ‌డిదారులు విక్ర‌యించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ర్యాలీకి అమ్మ‌కాలు అడ్డంకిగా నిలిచాయి. అయితే ఫ‌లితాల ప్ర‌క‌ట‌న పూర్త‌యితే మార్కెట్ల‌లో పాజిటివ్ మూవ్‌మెంట్ వ‌స్తుంద‌ని, ర్యాలీ కొన‌సాగే అవ‌కాశాలు ఉంటాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement