Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.7 లక్షల కోట్లు పెరిగిన సంపద..
Stock Markets | వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు నమోదు చేసి సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు సుమారు 3 శాతం చొప్పున పతనం అయిన తర్వాత, మంగళవారం భారత స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు ఇవ్వడం మార్కెట్లు పుంజుకోవడానికి ప్రధాన కారణంగా మారింది.
Stock Markets | వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు నమోదు చేసి సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు సుమారు 3 శాతం చొప్పున పతనం అయిన తర్వాత, మంగళవారం భారత స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు ఇవ్వడం మార్కెట్లు పుంజుకోవడానికి ప్రధాన కారణంగా మారింది. సెన్సెక్స్ 640 పాయింట్లు (0.82 శాతం) పెరిగి 78,205.98 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 50 కూడా 234 పాయింట్లు (0.97 శాతం) పెరిగి 24,261.60 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు లాభ పడ్డాయి. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 1.66 శాతం పెరగ్గా, బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 2.04 శాతం పెరిగింది.
రూ.7 లక్షల కోట్లు పెరిగిన సంపద..
ఒకే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు సుమారు రూ.7 లక్షల కోట్ల సంపదను సంపాదించారు. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.441 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.448 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలపై ఆశలు పెరగడం మార్కెట్లను ప్రోత్సహించాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఈ ఘర్షణ రెండో వారంలోకి ప్రవేశించినప్పటికీ త్వరలోనే ముగిసే అవకాశం ఉందని మార్కెట్లు అంచనా వేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం తీవ్రంగా దెబ్బతిన్నందున అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని తెలిపారు. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ట్రంప్ తాను ముందుగా పేర్కొన్న నాలుగు వారాల గడువుకంటే ముందే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
తగ్గిన ముడి చమురు ధరలు..
ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్‌కు ఊరటనిచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశముందని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో చమురు ధరలు భారీగా తగ్గాయి. అదనంగా చమురు సంబంధిత ఆంక్షలను ఎత్తివేయడం గురించి కూడా ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు ట్యాంకర్లను రక్షించేందుకు అమెరికా నౌకాదళాన్ని పంపే అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే జి7 దేశాలు ప్రపంచ ఇంధన సరఫరాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. అవసరమైతే నిల్వలను విడుదల చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటామని తెలిపాయి.
బలపడిన భారత రూపాయి..
మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 9 శాతం తగ్గి బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. చమురు ధరలు తగ్గడం భారత స్టాక్ మార్కెట్ల పెట్టుబడిదారులకు ప్రధాన ఊరటగా మారింది. ఎందుకంటే చమురు ధరల పెరుగుదల దేశీయ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భారత రూపాయి పుంజుకోవడం కూడా మార్కెట్ భావోద్వేగాలను మెరుగుపరిచింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 23 పైసలు పెరిగి 91.98 వద్ద ట్రేడైంది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదలపై ఆందోళనల మధ్య రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయి 92.3575ను తాకిన తర్వాత 58 పైసలు పడిపోయి 92.33 వద్ద ముగిసింది.
ఈ రంగాల్లో భారీగా పెట్టుబడులు..
ప్రధాన రంగాల్లో విలువ ఆధారిత కొనుగోళ్లు జరగడం మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది. ఇటీవలి మార్కెట్ సవరణ తర్వాత నాణ్యమైన షేర్లలో పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేయడంతో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఫార్మా సూచీలు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి. జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ మార్కెట్‌లో జరిగిన సవరణ కారణంగా ముఖ్యంగా లార్జ్ క్యాప్ షేర్ల ధరలు ఇప్పుడు సముచిత స్థాయికి వచ్చాయని తెలిపారు. ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్స్, ఫార్మాసూటికల్స్, డిఫెన్స్ రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు.
టాప్ గెయినర్లు, టాప్ లూజర్లు..
నిఫ్టీ 50లో ఎన్టీపీసీ షేర్లలో భారీగా పెరుగుదల కనిపించింది. ఆ సంస్థ షేర్లు ఏకంగా 1.94 శాతం పెరిగాయి. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా హిందుస్థాన్ యూనిలివర్ (0.62 శాతం), టాటా స్టీల్ (0.53 శాతం), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.49 శాతం), టైటాన్ కంపెనీ (0.24 శాతం) నిలిచాయి. ఇక టాప్ లూజర్ల జాబితాలో 6.60 శాతం తగ్గుదలతో టెక్ మహీంద్రా తొలి స్థానంలో నిలవగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (6.10 శాతం), ఎటర్నల్ (5.28 శాతం), ఇన్ఫోసిస్ (3.91 శాతం), టీసీఎస్ (3.79 శాతం) ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



