త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. సూచీల‌పై ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం..

Stock Markets | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర‌మైన అస్థిర‌త‌తో ట్రేడ్ అయ్యాయి. ఓ ద‌శ‌లో ఇంట్రా డే గ‌రిష్టాల‌ను తాకిన బెంచ్ మార్క్ సూచీలు ప్రారంభంలో వ‌చ్చిన లాభాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాయి. పెట్టుబ‌డిదారులు అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యారు.

S

Business | Published On May 4, 2026, 4.03 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. సూచీల‌పై ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం..
Advertisement

Stock Markets | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర‌మైన అస్థిర‌త‌తో ట్రేడ్ అయ్యాయి. ఓ ద‌శ‌లో ఇంట్రా డే గ‌రిష్టాల‌ను తాకిన బెంచ్ మార్క్ సూచీలు ప్రారంభంలో వ‌చ్చిన లాభాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాయి. పెట్టుబ‌డిదారులు అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యారు. దీంతో సూచీలు గ‌రిష్ట స్థాయి నుంచి చాలా దిగువ‌కు వ‌చ్చి, మొత్తానికి లాభాల్లోనే స్థిర‌ప‌డ్దాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు (0.46 శాతం) పెరిగి 77,269.40 వద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 121.75 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 24,119.30 వద్ద స్థిర‌ప‌డింది.

గ‌రిష్ట స్థాయి నుంచి భారీగా ప‌త‌నం..

ఇంట్రాడేలో ఓ ద‌శ‌లో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు ఎగ‌బాకింది. త‌రువాత 960 పాయింట్లు ప‌త‌న‌మై ఇంట్రాడే క‌నిష్టాన్ని తాకింది. మ‌ళ్లీ కాస్త రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసింది. అలాగే నిఫ్టీ50 సూచీ 250 పాయింట్లు పెరిగి ఇంట్రా డే గ‌రిష్టాన్ని తాకి తిరిగి 285 పాయింట్లు ప‌త‌న‌మై ఇంట్రా డే క‌నిష్టాన్ని ట‌చ్ చేసింది. అనంతం కాస్త రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసింది. అయితే దేశ‌వ్యాప్తంగా సోమ‌వారం వెలువ‌డ్డ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయ‌ని, అందుక‌నే సూచీలు తీవ్ర అస్థిర‌త‌తో ట్రేడ్ అయ్యాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం కూడా మార్కెట్ల వోల‌టిలిటీకి కారణ‌మైంద‌న్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డినందున ఈ వారంలో వోల‌టిలిటీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

పెరిగిన చమురు ధ‌ర‌లు, రూపాయి విలువ ప‌త‌నం..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ఉద‌యం సెష‌న్‌లో ఈక్విటీలు లాభాల్లో ఉండ‌డంతో చ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం అయ్యాయి. కానీ ఆ సూచీలు ప‌త‌నం కావ‌డంతో చ‌మురు ధర‌లు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 4.78 శాతం మేర పెరిగి 112 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 4.53 శాతం పెరిగి 103 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. అలాగే అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి మార‌కం విలువ మ‌ళ్లీ క‌నిష్ట స్థాయికి ప‌త‌న‌మైంది. డాల‌ర్‌కు రూపాయి విలువ 18 పైస‌లు త‌గ్గి 95.06 వ‌ద్ద ఉంది. క‌మోడిటీ మార్కెట్ల‌లోనూ తీవ్ర అస్థిర‌త క‌నిపించింది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర 1.82 శాతం త‌గ్గి ఔన్స్‌కు 4,530 వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 3.65 శాతం ప‌త‌న‌మై 72 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,127 పాయింట్లు ప‌త‌న‌మై 1,49,209 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 8,613 పాయింట్లు త‌గ్గి 2,42,404 వ‌ద్ద ఉంది. మార్కెట్‌లు తీవ్ర అస్థిర‌త‌తో ఉన్నందున పెట్టుబ‌డిదారులు ఇలాంటి స‌మ‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement