Stock Markets | స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆల్ టైం కనిష్టానికి రూపాయి విలువ పతనం..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనలు కొనసాగడం, ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 75,200.85 వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనలు కొనసాగడం, ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 75,200.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 32 పాయింట్లు (0.14 శాతం) తగ్గి 23,618 వద్ద క్లోజ్ అయింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం మార్కెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం పెరిగింది. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.17 శాతం ఎగబాకింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్ వంటి హెవీవెయిట్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం వల్ల బెంచ్‌మార్క్ సూచీలపై ఒత్తిడి పెరిగింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లపై ఆసక్తి..
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తుందన్న ఆశావాదంతో ప్రారంభంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ, చివరికి సూచీలు నష్టాల్లో ముగిశాయని తెలిపారు. పెద్ద షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మళ్లీ పెరిగాయని చెప్పారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయని వినోద్ నాయర్ పేర్కొన్నారు. అధిక డబ్ల్యూపీఐ గణాంకాలు, ఇంధన ధరల ప్రభావం, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కారణంగా క్యూ1ఎఫ్‌వై27 ఆదాయ అంచనాల్లో కోతలు వచ్చే అవకాశాలపై మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైందన్నారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.459 లక్షల కోట్లకు పైగా చేరింది. గత సెషన్‌లో ఇది రూ.458.4 లక్షల కోట్లుగా ఉంది.
స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, టీసీఎస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రూపాయి విలువ పడిపోవడం, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్ కారణంగా ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయని వినోద్ నాయర్ తెలిపారు. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.77 శాతం పెరిగి బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.63 శాతం పెరిగి బ్యారెల్‌కు 102 డాలర్ల వద్ద ఉంది.
భారీగా పతనమైన రూపాయి విలువ..
ఫారెక్స్ మార్కెట్‌లో మంగళవారం రూపాయి విలువ మళ్లీ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇప్పటికే ఆల్ టైమ్ కనిష్టానికి దిగువనే ట్రేడ్ అవుతున్న రూపాయి డాలర్‌కు 96.53 వద్ద ఉంది. రోజు రోజుకీ రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయిని చేరుతోంది. దీని వల్ల విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తమ నిధులను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ జోక్యం కారణంగా రూపాయి విలువ కాస్త స్థిరపడింది. అయినప్పటికీ అమెరికా డాలర్ రోజు రోజుకీ బలపడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుని అమెరికాతోపాటు ఇతర ఆసియా దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ప్రధాని మోదీ విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని పిలుపు ఇచ్చాక రూపాయి విలువ మరింతగా పతనమవడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



