Stock Markets | లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రియాల్టీ షేర్ల జోరు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూల గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాలు మార్కెట్‌లకు మద్దతుగా నిలిచాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూల గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాలు మార్కెట్‌లకు మద్దతుగా నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మంగళవారం ముగింపు 78,428.95 పాయింట్లతో పోలిస్తే 626.43 పాయింట్లు పెరిగి 79,055.38 వద్ద ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,614.90 నుంచి 24,669.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభ లావాదేవీల అనంతరం సెన్సెక్స్ 406.28 పాయింట్ల లాభంతో 78,835.23 వద్ద, నిఫ్టీ 8.70 పాయింట్ల స్వల్ప లాభంతో 24,623.60 వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువకు చేరి సుమారు 78.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా క్రూడ్ ధర బ్యారెల్‌కు 74.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. చమురు ధరల తగ్గుదల ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించి, రూపాయికి మద్దతు ఇవ్వడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా మారుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
రియాల్టీ షేర్ల కొనుగోళ్లు..
సెక్టోరల్ సూచీల్లో నిఫ్టీ రియాల్టీ 1.62 శాతం లాభంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. బీఎస్‌ఈలో ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు సన్ ఫార్మా, బీఈఎల్, టైటాన్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గ మాట్లాడుతూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడులు, కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చట్టసవరణలు మార్కెట్‌కు మద్దతునిస్తాయని అన్నారు. నిఫ్టీకి 24,400-24,300 స్థాయిలు కీలక మద్దతుగా ఉండగా, 25,000 స్థాయి ప్రధాన నిరోధంగా ఉంటుందని తెలిపారు.
24,700 కీలక స్థాయి..
యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా ప్రకారం నిఫ్టీ 24,700 స్థాయిని నిలకడగా దాటితే మళ్లీ 25,000 మార్కును పరీక్షించే అవకాశం ఉంటుందని, 24,400, ఆ తర్వాత 24,200 స్థాయిలు మద్దతుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ విశ్లేషకుడు విపిన్ దిక్సేనా మాట్లాడుతూ క్యూ1 ఫలితాల నేపథ్యంలో కంపెనీ-ప్రత్యేక షేర్లలో అవకాశాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
ఆగస్టు 12, 2026

Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ఆగస్టు 12, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్‌లకు చమురు సెగ.. భారీగా నష్టపోయిన సూచీలు..
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!

Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు



