Stock Markets | భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. రెండో దఫా శాంతి చర్చలపై పాజిటివ్ సంకేతాలు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ రెండో దఫా శాంతి చర్చలపై పాజిటివ్ సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఆశావహ దృక్పథం పెరిగింది. దీంతో వారు పెద్ద ఎత్తున కొనుగోళ్లను చేపట్టారు.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ రెండో దఫా శాంతి చర్చలపై పాజిటివ్ సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఆశావహ దృక్పథం పెరిగింది. దీంతో వారు పెద్ద ఎత్తున కొనుగోళ్లను చేపట్టారు. మార్కెట్లు ప్రీ ఓపెన్ సెషన్‌లో ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యే సంకేతాలను ఇచ్చినప్పటికీ ఆ తరువాత ట్రేడింగ్ ప్రారంభం నుంచే ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 537 పాయింట్లు (0.69 శాతం) పెరిగి 79,070 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ50 సూచీ 150 పాయింట్లు (0.60 శాతం) లాభపడి 24,510 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు ఒక్కోటి 0.50 శాతానికి పైగా ఎగబాకాయి. ఈ క్రమంలోనే విస్తృత మార్కెట్లలోనూ ర్యాలీ కొనసాగుతోంది.
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే..
నిఫ్టీ ఐటీ మినహా నిఫ్టీ రియాల్టీ, మెటల్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం ఈ వార్తలకు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు మంగళవారం సెషన్‌లో లాభాల్లో కొనసాగుతుండగా, గత రాత్రి జరిగిన సెషన్ లో అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు మళ్లీ మంగళ లేదా బుధవారాల్లో పాకిస్థాన్‌కు వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఈ చర్చలకు ట్రంప్ చివరి నిమిషంలో వాన్స్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. దీంతో మార్కెట్లలో పాజిటివ్ ధోరణి పెరిగింది.
తగ్గిన చమురు ధరలు, బలహీన పడ్డ రూపాయి..
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు మళ్లీ జరుగుతాయనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మంగళవారం తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.46 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.35 శాతం పతనమై 88 డాలర్లకు చేరింది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మంగళవారం మళ్లీ పతనమైంది. ఇవాళ్టి సెషన్‌లో 24 పైసలు క్షీణించిన రూపాయి డాలర్ విలువకు 93.35 వద్ద కొనసాగుతోంది. అయితే కాల్పుల విరమణకు ట్రంప్ ఇచ్చిన అనుమతి గడువు ముగుస్తుండడంతో ఇరు దేశాలు చర్చలను కొనసాగిస్తూ కాల్పుల విరమణను పొడిగిస్తాయా లేక మళ్లీ యుద్ధం బాట పడతాయా.. అని మార్కెట్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



