త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో అప్ర‌మ‌త్త‌త‌..

Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 మంగ‌ళ‌వారం సానుకూలంగా ప్రారంభం అయ్యాయి. గ‌త సెష‌న్‌లో లాభాల‌తో ముగిసిన మార్కెట్లు స్వ‌ల్ప గ్యాప‌ప్‌తో ఓపెన్ అయ్యాయి. త‌గ్గుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, కొత్త విదేశీ నిధుల ప్ర‌వాహం, ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోర‌ణి క‌నిపిస్తుండ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో సూచీలు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.

S

Business | Published On Sep 22, 2026, 9.50 am IST

Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో అప్ర‌మ‌త్త‌త‌..
Advertisement

Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 మంగ‌ళ‌వారం సానుకూలంగా ప్రారంభం అయ్యాయి. గ‌త సెష‌న్‌లో లాభాల‌తో ముగిసిన మార్కెట్లు స్వ‌ల్ప గ్యాప‌ప్‌తో ఓపెన్ అయ్యాయి. త‌గ్గుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, కొత్త విదేశీ నిధుల ప్ర‌వాహం, ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోర‌ణి క‌నిపిస్తుండ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో సూచీలు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్ల‌కు పైగా స్వ‌ల్పంగా పెరిగి 74,910 వ‌ద్ద ట్రేడ‌వుతుండ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 21 పాయింట్లు పెరిగి 23,435 వ‌ద్ద కొన‌సాగుతోంది. గ‌త సెష‌న్‌లో సూచీలు భారీ ర్యాలీతో కొన‌సాగాయి. సెన్సెక్స్ 564 పాయింట్లు ఎగ‌బాక‌గా, నిఫ్టీ 67 పాయింట్ల పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఇక మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో ఫార్మా, రియాల్టీ, మీడియా షేర్లు అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా, ప్రైవేటు బ్యాంక్స్‌, ఫైనాన్స్‌, డిఫెన్స్‌, క‌న్‌జ్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ రంగాల‌కు చెందిన షేర్లు భారీగా న‌ష్ట‌పోయాయి. విస్తృత మార్కెట్‌ల‌లో మాత్రం ర్యాలీ కొన‌సాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఏకంగా 0.92 శాతం పెర‌గ్గా, మిడ్ క్యాప్ 50 సూచీ 0.96 శాతం లాభ‌ప‌డింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 సూచీ మాత్రం 0.70 శాతం న‌ష్ట‌పోయింది.

మ‌ళ్లీ పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం ఈక్విటీ మార్కెట్ల‌కు మ‌ద్ద‌తునిస్తోంది. అయితే ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా చ‌మురు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. దీంతో చ‌మురు ధ‌ర‌ల్లోనూ తీవ్ర అస్థిర‌త చోటు చేసుకుంటోంది. మంగ‌ళ‌వారం సెష‌న్ లో చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.36 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.20 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు బ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.75 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.05 శాతం లాభ‌ప‌డింది. బ్యాంకింగ్ షేర్ల‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన షేర్ గా నిలిచింది. ఈ బ్యాంక్ షేర్ 1.18 శాతం మేర ప‌త‌న‌మైంది. జియో ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ షేర్ ఏకంగా 1.98 శాతం మేర ఎగ‌బాకింది. అయితే ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం పూర్తిగా ముగిసే వ‌ర‌కు మార్కెట్ల‌లో అనిశ్చిత ధోర‌ణి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని, చిన్న‌పాటి ర్యాలీల‌ను కూడా షార్ట్ క‌వ‌రింగ్‌గానే భావించాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement