KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్
KTR | స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
KTR | త్రినేత్ర.న్యూస్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అరెస్టులకు `మేము సిద్ధం.. మీరు సిద్ధమా?` అని సవాల్ విసిరారు.
`ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా?. అలానే మీకు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా - నిన్న మా ఎమ్మెల్యేలు సబితక్క, సునీతలను చీరలు లాగి, మెడపట్టి గెంటి, కొట్టిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పండి!
నిన్న హై కోర్ట్ అంత స్పష్టంగా చెప్పాక కూడా ఈరోజు కావాలని ఫేక్ కేసులు పెట్టి తాతా మధు గారిని, నవీన్ రెడ్డి గారిని అరెస్టులు చేశారంటే మీకు కోర్టులు, చట్టాలు పట్ల ఉన్న గౌరవం అర్థం అవుతుంది. ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారు!` అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
- ●Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
- ●Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు
- ●UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..
- ●అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు
- ●Harish Rao | అసెంబ్లీ వద్ద తోపులాట.. హరీశ్ రావు, కేటీఆర్‌పై కేసు

BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్

Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు

UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..




