త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం ఎఫెక్ట్.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగసిపడటం వల్ల భారత స్టాక్ మార్కెట్‌ల‌పై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే కీలక సూచీలు భారీ నష్టాల్లోకి జారిపోయాయి.

S

Business | Published On Jun 3, 2026, 10.59 am IST

Stock Markets | యుద్ధం ఎఫెక్ట్.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగసిపడటం వల్ల భారత స్టాక్ మార్కెట్‌ల‌పై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే కీలక సూచీలు భారీ నష్టాల్లోకి జారిపోయాయి. నిఫ్టీ 50 సూచీ 23,415 వద్ద బలహీనంగా ప్రారంభమై, ఇంట్రాడేలో 23,225 స్థాయికి పడిపోయింది. మార్కెట్ ప్రారంభమైన గంటలోనే 250 పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 74,507 వద్ద ప్రారంభమై, ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 73,719కి చేరుకుంది. దీంతో సెన్సెక్స్ దాదాపు 930 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లపై కూడా భారీ ఒత్తిడి కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 53,541 వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమై, 53,127 స్థాయికి పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే 587 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి..

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కఠిన వైఖరి, అమెరికన్ డాలర్ నిల్వల ఔట్ ఫ్లో, బలహీన వర్షాకాల అంచనాలు భారత మార్కెట్‌ల‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు నిలిచిపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం బహ్రెయిన్, కువైట్, ఇతర ప్రాంతీయ లక్ష్యాలపై ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను అమెరికా సైన్యం అడ్డుకుందని తెలిపింది. అయితే వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యపరమైన పురోగతి కనిపించకపోవడం ఆందోళనలను పెంచింది. కాగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు నేటి సెష‌న్‌లో భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.76 శాతం ఎగ‌సి బ్యారెల్‌కు 96 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతూ మ‌ళ్లీ 100 డాల‌ర్ల మార్కును స‌మీపిస్తుండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.63 శాతం పెరిగి 92 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ 48 పైస‌లు క్షీణించి 95.74 వ‌ద్ద ఉంది.

Advertisement
Advertisement