త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఫ్లాట్‌గా ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు.. శాంతి చ‌ర్చ‌ల కోస‌మే ఆగాయా..?

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధ‌త కొన‌సాగుతున్న నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్పంగా లాభ‌ప‌డి ఫ్లాట్ గా ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టీ50 సూచీ 60 పాయింట్లు పెరిగి 24,150 వ‌ద్ద ఉండ‌గా, సెన్సెక్స్ 87 పాయింట్లు పెరిగి 77,400 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.

S

Business | Published On Apr 28, 2026, 11.00 am IST

Stock Markets | ఫ్లాట్‌గా ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు.. శాంతి చ‌ర్చ‌ల కోస‌మే ఆగాయా..?
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధ‌త కొన‌సాగుతున్న నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్పంగా లాభ‌ప‌డి ఫ్లాట్ గా ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టీ50 సూచీ 60 పాయింట్లు పెరిగి 24,150 వ‌ద్ద ఉండ‌గా, సెన్సెక్స్ 87 పాయింట్లు పెరిగి 77,400 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. శాంతి చ‌ర్చ‌ల‌పై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మార్కెట్ల‌ను ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆయా విష‌యాల‌పై ఎలాంటి వార్త వ‌చ్చినా ప్ర‌స్తుతం మార్కెట్లు రియాక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందువ‌ల్ల పెట్టుడిదారులు ప్ర‌స్తుతం రిస్క్ తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్‌గా వార్త‌లు వ‌స్తే మార్కెట్లు ఇక్క‌డి నుంచి పుంజుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, లేదంటే మ‌ళ్లీ ప‌త‌నం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

స్వ‌ల్పంగా పెరిగిన చమురు ధ‌ర‌లు, రూపాయి మ‌ళ్లీ ప‌త‌నం..

అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో అనిశ్చితి కొన‌సాగుతున్న కార‌ణంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. అంత‌ర్జాతీయ ఇంధ‌న మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 0.85 డాల‌ర్లు పెరిగి 102.45 వ‌ద్ద ఉండ‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.74 డాల‌ర్లు పెరిగి 95.435 వ‌ద్ద ఉంది. ఇక అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి మార‌కం విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. 28 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి డాల‌ర్‌కు 94.43 వ‌ద్ద ఉంది. ఆసియా మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది. జ‌పాన్ నిక్కీ225 సూచీ 650 పాయింట్లు ప‌త‌న‌మ‌వ్వగా, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 40 పాయింట్ల మేర లాభాల్లో ఉంది. అలాగే షాంఘై కంపోజిట్ 8 పాయింట్ల న‌ష్టంలో ట్రేడ‌వుతోంది. మార్కెట్‌ల‌ను ప‌రిశీలిస్తే అమెరికా-ఇరాన్ చ‌ర్చ‌ల కోస‌మే ప్ర‌స్తుతం అవి ఎదురు చూస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే దీనిపై అటు ట్రంప్‌, ఇటు ఇరాన్ ఏం తేలుస్తాయో చూడాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement