Stock Markets | భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల కొనుగోళ్ల జోరు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే గ్యాప్-అప్ అయిన బెంచ్ మార్క్ సూచీలు తరువాత కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ50, సెన్సెక్స్ సూచీలు ఒక్కోటి దాదాపుగా 1 శాతానికి పైగా పెరిగి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే గ్యాప్-అప్ అయిన బెంచ్ మార్క్ సూచీలు తరువాత కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ50, సెన్సెక్స్ సూచీలు ఒక్కోటి దాదాపుగా 1 శాతానికి పైగా పెరిగి లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ50 సూచీ 291 పాయింట్లు పెరిగి 24,285 ఇంట్రా డే గరిష్టాన్ని తాకగా, సెన్సెక్స్ 957 పాయింట్లు లాభపడి 77,900 ఇంట్రా డే గరిష్టాన్ని టచ్ చేసింది. అన్ని సెక్టార్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఆటో రంగం 2.3 శాతంతో టాప్‌లో నిలిచింది. అలాగే ఐటీ షేర్లు 1.46 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో 0.62 శాతం పెరుగుదల కనిపించింది.
మూడు రోజుల నష్టాల నుంచి రికవరీ..
మార్కెట్ గత మూడు రోజుల నష్టాల నుంచి రికవరీ అయి మళ్లీ లాభాల బాట పట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా వంటి కంపెనీలు నిఫ్టీ50 ర్యాలీకి కారణమయ్యాయి. హోర్ముజ్ జలసంధిలో సైనిక కార్యకలాపాలను తగ్గించే దిశగా ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేస్తుండడంతో యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. దీంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రధానంగా ఎనర్జీ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ బలమైన కొనుగోళ్లతో ట్రేడ్ అవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 107 నుంచి 111 డాలర్ల మధ్య ఉన్నప్పటికీ యుద్ధం ముగింపుపై ఆశలు చిగురిస్తుండడంతో పెట్టుబడిదారులు మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్నారు.
ఎఫ్ఐఐల అమ్మకాలకు డీఐఐల అడ్డుకట్ట..
క్రితం సెషన్ ముగింపులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) లు భారీగా విక్రయించినప్పటికీ దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నిధుల ప్రవాహం పెంచడంతో ఎఫ్ఐఐల అమ్మకాలకు భారీగా అడ్డుకట్ట వేశారు. దీంతో మార్కెట్లలో భారీ పతనం తప్పింది. అయితే అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు జరగకపోయినా, హోర్ముజ్ పరిస్థితి అలాగే ఉన్నా ఈక్విటీ మార్కెట్ల దిశ మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



