త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా-ఇరాన్ మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు.. ప‌త‌నం దిశ‌గా స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో బలహీనతల‌ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్న‌ది. బీఎస్ఈ సెన్సెక్స్ 165.68 పాయింట్లు (0.21 శాతం) పడిపోయి 77,103.72 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 66.70 పాయింట్లు (0.28 శాతం) తగ్గి 24,052.60 వద్ద ఓపెన్ అయింది.

S

Business | Published On May 5, 2026, 9.58 am IST

Stock Markets | అమెరికా-ఇరాన్ మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు.. ప‌త‌నం దిశ‌గా స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో బలహీనతల‌ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్న‌ది. బీఎస్ఈ సెన్సెక్స్ 165.68 పాయింట్లు (0.21 శాతం) పడిపోయి 77,103.72 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 66.70 పాయింట్లు (0.28 శాతం) తగ్గి 24,052.60 వద్ద ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా 187.20 పాయింట్లు (0.34 శాతం) పడిపోయి 54,691.30 వద్ద ప్రారంభమైంది. విస్తృత మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.15 శాతం పెరిగినప్పటికీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.10 శాతం తగ్గింది.

గ్లోబ‌ల్ మార్కెట్లు నెగెటివ్‌గానే..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా సూచీలు లాభాలలో కొన‌సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే ఆసియా మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడ్ అవుతుండ‌గా, అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా గత రాత్రి పడిపోయాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ తన రికార్డ్ హై నుండి వెనక్కి తగ్గింది. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నాలుగు వారాల కాల్పుల విర‌మ‌ణ ముగిసే పరిస్థితి ఏర్పడింది. తాజా కాల్పుల్లో యూఏఈ కూడా చేరడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ యుద్ధంలో పాల్గొంటుండ‌డంతో గ‌ల్ఫ్ దేశాలు ఏం చేద్దామా అని చ‌ర్చిస్తున్నాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

క్రూడ్ ఆయిల్ ధరలు గత సెషన్‌లో 6 శాతం వరకు పెరిగిన తర్వాత స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ జూలై ఫ్యూచర్స్ 0.95 శాతం తగ్గి బ్యారెల్‌కు 113.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ 1.95 శాతం పడిపోయి 104.34 డాలర్లకు చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌగోళిక ప‌రిణామాలు వేగంగా మారుతుండ‌డంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం వార్త‌లే ప్ర‌స్తుతం మార్కెట్ల దిశ‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌ధాన అంశాలుగా మారాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement