Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..
Stock Markets | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ బలహీనపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర బ్యాంకులు మరింత కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబించే అవకాశాలపై అంచనాలు పెరిగాయి.
Stock Markets | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ బలహీనపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర బ్యాంకులు మరింత కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబించే అవకాశాలపై అంచనాలు పెరిగాయి. దీంతో మార్కెట్‌లలో జాగ్రత్త ధోరణి కొనసాగింది. దేశీయంగా కూడా కొన్ని ప్రతికూల అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల త్రైమాసిక ఫలితాల్లో నెట్ ఇంటరెస్ట్ మార్జిన్లపై ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల రుణాల వృద్ధి బలంగా ఉన్నప్పటికీ లాభదాయకతపై ప్రభావం పడుతోందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. దీంతో ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
లాభాల్లో విస్తృత మార్కెట్లు..
అయితే కొన్ని హెవీవెయిట్ షేర్లలో బలమైన కొనుగోళ్లు రావడంతో నిఫ్టీ 50 ప్రారంభ నష్టాలను కొంతవరకు తగ్గించుకుంది. చివరికి నిఫ్టీ 0.40 శాతం నష్టంతో 24,233 వద్ద ముగియగా, సెన్సెక్స్ 0.53 శాతం క్షీణించి 77,737 వద్ద స్థిరపడింది. మొత్తంగా నిఫ్టీ 95.80 పాయింట్ల నష్టంలో ముగియగా, సెన్సెక్స్ 442.93 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా, విస్తృత మార్కెట్ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు రెండూ లాభాలతో ముగియడం విశేషం. దీంతో విస్తృత మార్కెట్‌లలో బుల్స్ ఆధిపత్యం కొనసాగినట్లు కనిపించింది. రంగాల వారీగా చూస్తే మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ దాదాపు 3 శాతం ఎగబాకి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దీనికి విరుద్ధంగా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 2.25 శాతం క్షీణించింది. ఎంపిక చేసిన ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలే దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి.
రూపాయి విలువ మళ్లీ పతనం..
ఇతర రంగాల్లో నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా సోమవారం వరుసగా పదో రోజు కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించగా, ఇరాన్ జోర్డాన్ వైపు క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఈ ఘర్షణ మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కూడా ఈ ఉద్రిక్తతల్లో మరింతగా చిక్కుకునే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లలో సోమవారం ఉదయం సెషన్‌లో క్రూడ్ ఆయిల ధరలు భారీగా పెరిగినప్పటికీ తరువాత కాస్త తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.37 శాతం మేర తగ్గిబ్యారెల్‌కు 86 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ ధర 0.46 శాతం తగ్గి బ్యారెల్‌కు 82 డాలర్ల వద్ద నిలిచింది. అలాగే ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మళ్లీ తగ్గింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 96.44 వద్ద ఉన్న భారత రూపాయి సెషన్‌లో 18 పైసలు నష్టపోయింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






