త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధ‌వారం నష్టాలతో ముగిశాయి. కీలకమైన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లపై ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 183 పాయింట్లు (0.24 శాతం) నష్టపోయి 77,472.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 127 పాయింట్లు (0.52 శాతం) క్షీణించి 24,207.75 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Aug 26, 2026, 4.14 pm IST

Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధ‌వారం నష్టాలతో ముగిశాయి. కీలకమైన అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లపై ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 183 పాయింట్లు (0.24 శాతం) నష్టపోయి 77,472.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 127 పాయింట్లు (0.52 శాతం) క్షీణించి 24,207.75 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు మాత్రం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ ఎలాంటి మార్పు లేకుండా ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ 0.60 శాతం లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీపై భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టూబ్రో, ఇన్ఫోసిస్ షేర్లు అధిక ఒత్తిడిని చూపించాయి.

పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణ భ‌యాలు..

అమెరికాలో జూలై నెల వ్యక్తిగత వినియోగ వ్యయాల ధర సూచీ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సూచీల్లో వ్యక్తిగత వినియోగ వ్యయాల ధర సూచీ ఒకటి. ఈ గణాంకాలు వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలకు కీలకంగా మారనున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 3 శాతం పడిపోవడం సానుకూల పరిణామంగా కనిపించినప్పటికీ, అది భారత మార్కెట్లకు పెద్దగా ఊరటనివ్వలేకపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించాయి. అమెరికా ఇరాన్, దాని వాణిజ్య భాగస్వాములపై ఆర్థిక ఆంక్షలు విధించగా, ఈ ఆంక్షలతో ప్రాంతంలో శాంతి నెలకొనదని ఇరాన్ హెచ్చరించింది.

త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు..

దేశీయ మార్కెట్లు ప్రారంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ, సెషన్ చివర్లో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. వివిధ రంగాల మధ్య భిన్నమైన పనితీరు ప్రధాన సూచీలపై ప్రభావం చూపింది. అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షల తీవ్రత కొంత తగ్గడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గాయి. దేశీయ బాండ్ ఈల్డ్స్ తగ్గడం, బ్యాంకింగ్ షేర్లకు మద్దతు లభించడం సానుకూల అంశాలుగా మారాయి. లోహాల షేర్లు కూడా మెరుగైన ధరల అవకాశాలతో లాభపడ్డాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బుధ‌వారం ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.06 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 84 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.12 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 80 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మార‌కం విలువ అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే స్థిరంగా కొన‌సాగింది. డాల‌ర్‌కు రూపాయి 95.40 వద్ద ఉంది.

Advertisement
Advertisement