త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | లాభాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా గ‌త రెండు వారాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయిన విష‌యం తెలిసిదే. సోమ‌వారం సెష‌న్ మాత్రం లాభాల్లో ముగిసింది. మంగ‌ళ‌వారం కూడా అదే బుల్ ర్యాలీ కొన‌సాగుతోంది. అన్ని ప్ర‌ధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి.

S

Business | Published On Mar 17, 2026, 10.29 am IST

Stock Markets | లాభాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా గ‌త రెండు వారాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం అయిన విష‌యం తెలిసిదే. సోమ‌వారం సెష‌న్ మాత్రం లాభాల్లో ముగిసింది. మంగ‌ళ‌వారం కూడా అదే బుల్ ర్యాలీ కొన‌సాగుతోంది. అన్ని ప్ర‌ధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 321 పాయింట్లు (0.43 శాతం) పెరిగి 75,820 వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీ50 106 పాయింట్లు (0.45 శాతం) పెరిగి 23,511 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలు న‌మోదు అయ్యాయి. నిఫ్టీ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ 0.39 శాతం పెర‌గ్గా, నిఫ్టీ బ్యాంక్ 0.05, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ 0.50, నిఫ్టీ స్మాల్ క్యాప్100 0.44, నిఫ్టీ ఆటో 1.87, నిఫ్టీ మీడియా 0.58, మెట‌ల్ 1.34, ఫార్మా 0.58 శాతం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ మాత్రం 0.13, 1.41 శాతం చొప్పున న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.

రూపాయి ప‌త‌నం, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో భార‌త రూపాయి మార‌కం విలువ మ‌రింత త‌గ్గింది. 14 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి 92.42 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంత‌ర్జాతీయ ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, విదేశీ పెట్టుబ‌డిదారులు భార‌త స్టాక్ మార్కెట్ల నుంచి న‌గ‌దును ఉప‌సంహరించుకుంటుండ‌డంతో రూపాయి విలువ రోజు రోజుకీ ప‌డిపోతోంది. ఇక ఎంసీఎక్స్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం సెష‌న్‌లో పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 125 పాయింట్లు (1.43 శాతం) పెరిగి 8846 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. అలాగే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 2.81 శాతం పెరిగి 103 డాల‌ర్ల‌కు పైన ట్రేడ్ అవుతోంది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు 2.97 శాతం పెరిగి 96 డాల‌ర్ల‌కు పైన ట్రేడ‌వుతోంది.

తాత్కాలిక‌మే..

అంత‌ర్జాతీయంగా ఉద్రిక‌త్త‌లు నెల‌కొన్న‌ప్ప‌టికీ మార్కెట్ల‌లో ఇలాంటి చిన్నైసైజు క‌రెక్ష‌న్ రావ‌డం స‌హ‌జ‌మే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధార‌ణంగా మార్కెట్లు భారీ ఎత్తున ప‌త‌నం అయిన‌ప్పుడు విలువ ఆధారిత షేర్లు, లార్జ్ క్యాప్ షేర్ల ధ‌ర‌లు బాగా త‌గ్గుతాయి. అవి పెట్టుబ‌డిదారుల‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. క‌నుక‌నే కొనుగోళ్లు పెరిగాయ‌ని చెబుతున్నారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం ముగియడంతోపాటు చ‌మురు ధ‌ర‌లు దిగి వ‌స్తేనే మార్కెట్లు కోలుకుంటాయ‌ని, అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఇలాగే ఉండే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement