త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | రైలు ఎక్క‌డం ఆల‌స్యం అయితే ఇక‌పై టిక్కెట్‌ను కోల్పోవాల్సిందే.. రైల్వే శాఖ కొత్త రూల్‌..

Indian Railways | రైళ్ల‌లో ప్ర‌యాణించేవారు కొన్ని సంద‌ర్భాల్లో అనుకోని కార‌ణాల వ‌ల్ల రైలు బ‌య‌ల్దేరే స‌మ‌యానికి స్టేష‌న్‌కు చేరుకోలేక‌పోతుంటారు. దీని వ‌ల్ల చివ‌రి నిమిషంలో రైలులో ఎక్కుతారు. లేదా కొన్ని సార్లు రైలును అందుకోలేక‌పోతారు. దీంతో ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మో లేదా త‌దుప‌రి స్టేష‌న్‌లో రైలు ఎక్క‌డ‌మో జరుగుతుంది.

S

Business | Published On Feb 8, 2026, 8.47 am IST

Indian Railways | రైలు ఎక్క‌డం ఆల‌స్యం అయితే ఇక‌పై టిక్కెట్‌ను కోల్పోవాల్సిందే.. రైల్వే శాఖ కొత్త రూల్‌..
Advertisement

Indian Railways | రైళ్ల‌లో ప్ర‌యాణించేవారు కొన్ని సంద‌ర్భాల్లో అనుకోని కార‌ణాల వ‌ల్ల రైలు బ‌య‌ల్దేరే స‌మ‌యానికి స్టేష‌న్‌కు చేరుకోలేక‌పోతుంటారు. దీని వ‌ల్ల చివ‌రి నిమిషంలో రైలులో ఎక్కుతారు. లేదా కొన్ని సార్లు రైలును అందుకోలేక‌పోతారు. దీంతో ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవ‌డ‌మో లేదా త‌దుప‌రి స్టేష‌న్‌లో రైలు ఎక్క‌డ‌మో జరుగుతుంది. అయితే ఇక‌పై ఇలాంటి సంద‌ర్భాల్లో రైలు ప్ర‌యాణికుల టిక్కెట్ల‌ను ఇత‌ర ప్ర‌యాణికుల‌కు కేటాయించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గంట‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం పాటు వేచి చూశాక మాత్ర‌మే అలాంటి ప్ర‌యాణికుల టిక్కెట్ల‌ను వెయిటింగ్ లిస్టు లేదా ఆర్ఏసీ ప్ర‌యాణికుల‌కు కేటాయిస్తూ వ‌చ్చారు. కానీ ఇక‌పై ఈ రూల్‌ను మార్చ‌నున్నారు.

ఆక్యుపెన్సీని పెంచేందుకే..

రైలులో ప్ర‌యాణించేవారు ఆల‌స్యంగా వ‌స్తే ఇక‌పై ట్రెయిన్ టిక్కెట్‌ను కోల్పోయే అవ‌కాశం ఉంటుంది. అవును. రైల్వే శాఖ దీనిపై ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు చేస్తోంది. రైలును చేర‌లేక త‌దుప‌రి స్టేష‌న్‌లో ఎక్కేవారు లేదా చివ‌రి నిమిషంలో ఆల‌స్యంగా ట్రెయిన్ ఎక్కేవారు ఇక‌పై త‌మ టిక్కెట్ల‌ను కోల్పోతారు. ప్రయాణికులు ఏ కార‌ణం వల్ల అయినా స‌రే రైలులో ప్రయాణం చేయ‌క‌పోతే వారి టిక్కెట్ల‌ను ఇత‌రుల‌కు కేటాయించేందుకు టీటీఈల‌కు ప్ర‌స్తుతం చాలా స‌మ‌యం ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రైలులో చాలా వ‌ర‌కు సీట్లు ఖాళీగా ఉంటున్నాయ‌ని రైల్వే శాఖ గుర్తించింది. దీని వ‌ల్ల స‌గ‌టున ఒక రైలులో 3 నుంచి 5 శాతం వ‌ర‌కు సీట్లు ఖాళీగా ఉంటున్నాయ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ కొత్త విధానం వ‌ల్ల రైలులో పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీ పెరుగుతుంద‌ని, అలాగే వెయిటింగ్ లిస్టు లేదా ఆర్ఏసీలో ఉన్న ప్ర‌యాణికుల‌కు కూడా త్వ‌ర‌గా టిక్కెట్ క‌న్‌ఫామ్ అయి వారు ప్రయాణించే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని చెబుతున్నారు.

ఇత‌రుల‌కు టిక్కెట్ల కేటాయింపు..

నూత‌న విధానం వ‌ల్ల టీటీఈ ఇక‌పై రైలు ప్ర‌యాణికుల టిక్కెట్ల‌ను ఆయా సంద‌ర్భాల్లో వెంట‌నే ఇత‌ర ప్ర‌యాణికుల‌కు కేటాయిస్తారు. అంటే ఒక ప్ర‌యాణికుడు తాను ఎక్క‌బోయే రైలును టైముకు అందుకోక‌పోయినా లేదా వేరే స్టేష‌న్‌లో రైలు ఎక్కాల‌ని చూసినా ఇకపై కుద‌ర‌ద‌న్న‌మాట‌. అత‌ని టిక్కెట్‌ను అప్ప‌టికే టీటీఈలు ఇతరుల‌కు కేటాయించి ఉంటారు. క‌నుక వారికి ప్ర‌యాణం సాధ్య‌ప‌డ‌దు. కాబ‌ట్టి రైలు ప్ర‌యాణికులు టైముకు స్టేష‌న్‌కు వ‌చ్చి రైలులో ఎక్కాల్సి ఉంటుంది. ఇక అనుకోని కార‌ణాల వ‌ల్ల ముందుగా చెప్పిన స్టేష‌న్ కాకుండా వేరే స్టేష‌న్‌లో రైలులో ఎక్క‌డం కూడా కుద‌ర‌దు. ఒక వేళ అలా ఎక్కాల్సి వ‌స్తే 24 గంట‌ల ముందే ప్ర‌యాణికులు త‌మ బోర్డింగ్ స్టేష‌న్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. క‌నుక ఇక‌పై రైలు ప్ర‌యాణికులు ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తార‌న్న విష‌యంపై స్ప‌ష్టత రాలేదు. కానీ ప్ర‌స్తుతం దీన్ని కొన్ని చోట్ల ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement