త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian IT Stocks | ఆంథ్రోపిక్ ఎఫెక్ట్‌.. భార‌తీయ ఐటీ షేర్ల‌లో బుల్ ర్యాలీ..

Indian IT Stocks | కింద‌టి వారం ట్రేడింగ్ సెష‌న్ల‌లో భార‌తీయ ఐటీ కంపెనీల స్టాక్స్ తీవ్ర‌మైన అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కానీ ఫిబ్ర‌వ‌రి 17 నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో మాత్రం ఆ ఒత్తిడి నుంచి కాస్త రిక‌వ‌ర్ అయ్యాయి. గ‌త వారం నిఫ్టీ ఐటీ సూచీ 8.2 శాతం ప‌త‌నం అయి 11 నెలల వ్య‌వ‌ధిలో అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేసింది.

S

Business | Published On Feb 17, 2026, 12.28 pm IST

Indian IT Stocks | ఆంథ్రోపిక్ ఎఫెక్ట్‌.. భార‌తీయ ఐటీ షేర్ల‌లో బుల్ ర్యాలీ..
Advertisement

Indian IT Stocks | కింద‌టి వారం ట్రేడింగ్ సెష‌న్ల‌లో భార‌తీయ ఐటీ కంపెనీల స్టాక్స్ తీవ్ర‌మైన అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కానీ ఫిబ్ర‌వ‌రి 17 నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో మాత్రం ఆ ఒత్తిడి నుంచి కాస్త రిక‌వ‌ర్ అయ్యాయి. గ‌త వారం నిఫ్టీ ఐటీ సూచీ 8.2 శాతం ప‌త‌నం అయి 11 నెలల వ్య‌వ‌ధిలో అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేసింది. అయితే మంగ‌ళ‌వారం నాటి సెష‌ల్‌లో మ‌ళ్లీ కాస్త రిక‌వ‌ర్ అయి 2 శాతం పెరుగుద‌ల న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే పెట్టుబ‌డిదారులు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్ల‌ను మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లో కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని చూపించారు. ఐటీ స్టాక్స్‌లో న‌మోదైన పెరుగుద‌ల కార‌ణంగా ప్ర‌ధాన సూచీలైన నిఫ్టీ 50, సెన్సెక్స్‌లు సైతం బుల్ ర్యాలీని కొన‌సాగించాయి. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌తోపాటు ప‌లు ప్ర‌ధాన ఫైనాన్స్ సంబంధిత స్టాక్స్‌లో బ‌ల‌హీన‌త క‌నిపించింది. అయిన‌ప్ప‌టికీ సూచీల పెరుగుద‌ల‌కు ఐటీ స్టాక్స్ దోహ‌దం చేశాయి.

ఆంథ్రోపిక్‌-ఇన్ఫోసిస్ ఒప్పంద‌మే కార‌ణం..

మంగ‌ళ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో ఐటీ స్టాక్స్ పెరిగేందుకు ప్ర‌ధాన కార‌ణం ఇన్ఫోసిస్‌, ఆంథ్రోపిక్‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పంద‌మే అని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ దిగ్గ‌జం అయిన ఆంథ్రోపిక్ భార‌త కంపెనీ ఇన్ఫోసిస్‌తో ఒప్పందం కుదుర్చోవ‌డం ఆ కంపెనీ షేర్ల‌కు ఊత‌మిచ్చింద‌ని, దీని వ‌ల్ల ఇన్ఫోసిస్ షేర్లు 3 శాతం పెరిగాయ‌ని తెలిపారు. అయితే ఈ ఒప్పందం కేవ‌లం ఇన్ఫోసిస్ మాత్ర‌మే కాకుండా ఆ రంగానికి సైతం పాజిటివ్ వార్త‌గా మారింద‌ని, అందుక‌నే ఐటీ స్టాక్స్‌లో పెరుగుద‌ల చోటు చేసుకుంద‌ని తెలిపారు. ఆంథ్రోపిక్ కు చెందిన క్లాడ్‌ ఏఐ వాడ‌కం భార‌త్‌లో పెరిగింద‌ని తాజాగా ఆ సంస్థే తెలియ‌జేసింది. క్లాడ్ ఏఐని ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల కోసం వినియోగిస్తున్నాయి. బ్యాంకింగ్‌, హెల్త్ కేర్‌, ప్ర‌జా సేవ‌ల రంగాల్లో క్లాడ్ ఏఐని ప‌లు కంపెనీలు వినియోగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆంథ్రోపిక్‌తో ఇన్ఫోసిస్ ఒప్పందం కుద‌ర్చుకోవడం అత్యంత పాటిజివ్ విష‌యంగా మారింద‌న్నారు.

ఏయే షేర్ల ధ‌ర‌లు ఎంత పెరిగాయంటే..

ఉద‌యం 10.30 గంట‌ల వ‌ర‌కు నెల‌కొన్న స్థితి ప్ర‌కారం నిఫ్టీ ఐటీ సూచీ 1.92 శాతం పెర‌గ‌గా, ఐటీ స్టాక్స్‌లోనూ గ‌ణ‌నీయంగా వృద్ధి చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్లు 3.03 శాతం, కోఫోర్జ్ లిమిటెడ్ 2.01, పెర్సిస్టెంట్ సిస్ట‌మ్స్ లిమిటెడ్ 1.99, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ 1.81, విప్రో 1.73, ఒరాకిల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సాఫ్ట్‌వేర్ 1.69 శాతం పెరుగుద‌ల న‌మోదు చేశాయి. ఎంఫ‌సిస్ షేర్ల‌లో 1.23 శాతం పెరుగుద‌ల న‌మోదు కాగా, టీసీఎస్ షేర్లు 1.22 శాతం, ఎల్‌టీఐ మైండ్ ట్రీ 1.18, టెక్ మ‌హీంద్రా షేర్లు 1.14 శాతం వృద్ధిని సాధించాయి. అయితే కేవ‌లం లార్జ్ క్యాప్ కంపెనీలు మాత్ర‌మే కాకుండా, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఐటీ సంస్థ‌ల షేర్లలోనూ పెరుగుద‌ల చోటు చేసుకుంది.

Advertisement
Advertisement