India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
India-US Trade Deal | అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ దేశాలతో పోలిస్తే భారత ఎగుమతిదారులకు ప్రాధాన్య టారిఫ్ రేట్లు కల్పించేందుకు అమెరికా అంగీకరించిన తర్వాతే ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలను ప్రకటిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం స్పష్టం చేశారు.
India-US Trade Deal | అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ దేశాలతో పోలిస్తే భారత ఎగుమతిదారులకు ప్రాధాన్య టారిఫ్ రేట్లు కల్పించేందుకు అమెరికా అంగీకరించిన తర్వాతే ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలను ప్రకటిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం స్పష్టం చేశారు. జాతీయ స్థాయి లీవరేజింగ్ ఎఫ్‌టీఏస్ ఔట్రీచ్ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రాధాన్య రేటును అందించగలిగిన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసి, తుది వివరాలను ప్రకటిస్తామని అన్నారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు మార్కెట్ ప్రవేశాన్ని విస్తరించడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్చలు జరుపుతున్నాయి.
జూలైలో ఓ సీనియర్ అమెరికా అధికారి మాట్లాడుతూ.. ఒప్పందానికి సంబంధించిన పాఠ్యం దాదాపు పూర్తిగా ఖరారైందని, మూడు నుంచి నాలుగు నెలల్లో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే అమెరికా కొనసాగిస్తున్న సెక్షన్ 301 వాణిజ్య దర్యాప్తులే ప్రధానంగా మిగిలిన అడ్డంకిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇప్పటికే కాగితంపై సిద్ధంగా ఉందని, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య పరిష్కరించాల్సిన ప్రధాన విభేదాల కారణంగా ఆలస్యం జరగడం లేదని, ఇది కేవలం ప్రక్రియకు సంబంధించిన అంశమని అమెరికా అధికారి వివరించారు.
కాగా పోటీ దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే భారత ఎగుమతిదారులకు స్పష్టమైన ప్రయోజనం కలిగించేలా టారిఫ్ నిబంధనలు ఉండాలని భారత్ కోరుతోంది. ఈ అంశంపై అమెరికా నుంచి అనుకూలమైన హామీ లభించిన తర్వాతే బీటీఏ తుది రూపు దాల్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్






