Two Wheeler | మీ టూవీలర్ ఓవర్ హీటింగ్‌కు గురవుతుందా..? ఈ 5 చిట్కాలు పాటించండి..!
Two Wheeler | ట్రాఫిక్‌లో అధికంగా గడపడం, ఎక్కువ సేపు ఇంజిన్ ఉపయోగంలో లేకుండా ఐడిల్‌లో ఉండడం వంటి అనేక కారణాల వల్ల ద్విచక్ర వాహనాలకు చెందిన ఇంజిన్లలో అప్పుడప్పుడు ఓవర్ హీటింగ్ అనే సమస్య వస్తుంటుంది. అయితే దీన్ని చిన్న సమస్యనే అని చాలా మంది లైట్ తీసుకుంటారు.
Two Wheeler | ట్రాఫిక్‌లో అధికంగా గడపడం, ఎక్కువ సేపు ఇంజిన్ ఉపయోగంలో లేకుండా ఐడిల్‌లో ఉండడం వంటి అనేక కారణాల వల్ల ద్విచక్ర వాహనాలకు చెందిన ఇంజిన్లలో అప్పుడప్పుడు ఓవర్ హీటింగ్ అనే సమస్య వస్తుంటుంది. అయితే దీన్ని చిన్న సమస్యనే అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ దీని వల్ల దీర్ఘకాలంలో వాహన పనితీరుపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిస్టన్ దెబ్బ తినడం, మైలేజీ తగ్గిపోవడం, పార్ట్‌లను తరచూ మార్చాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీని వల్ల వాహనం పనితీరు ఇంకా గణనీయంగా తగ్గి చివరకు అసలు వాడకానికి వీలు లేకుండా తయారవుతుంది. అయితే ఏ బ్రాండ్‌కు చెందిన మోటార్ సైకిల్ అయినా సరే యజమానులు వాహనం ఇచ్చే చిన్నపాటి సూచనలను, హెచ్చరికలను పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నాణ్యమైన ఇంజిన్ ఆయిల్..
మొదటగా ఇంజిన్ ఆయిల్ స్థాయి, నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలి. తక్కువ స్థాయి లేదా నాసిరకం ఆయిల్ వాడటం వల్ల ఓవర్‌హీటింగ్ సమస్య తీవ్రం అవుతుంది. ఇంజిన్ లోపలి భాగాలకు స్నిగ్ధత (Viscosity) కల్పించడం, ఉష్ణాన్ని తగ్గించడం ఆయిల్ ప్రధాన బాధ్యత. సిఫారసు చేసిన స్థాయికంటే తక్కువగా ఆయిల్ ఉంటే ఘర్షణ పెరిగి ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. సాధారణంగా ఆయిల్ మార్చడానికి రూ.300 నుండి రూ.800 వరకు ఖర్చవుతుండగా, పిస్టన్ లేదా సిలిండర్ మరమ్మత్తులకు రూ.5వేల నుండి రూ.15వేల వరకు వెచ్చించాల్సి రావచ్చు. లిక్విడ్ కూల్డ్ బైక్ ఉన్నవారు కూలెంట్ స్థాయిని తనిఖీ చేయాలి. చాలా మంది ఈ విషయాన్ని గమనించరు. కూలెంట్ తక్కువగా ఉండటం లేదా లీకేజీలు ఉండటం వల్ల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. ఎయిర్ కూల్డ్ బైక్‌లతో పోలిస్తే, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌లలో సర్వీస్ షెడ్యూల్ ప్రకారం కూలెంట్‌ను మారుస్తూ ఉండాలి. అప్పుడే వాహనం పనితీరు సరిగ్గా ఉంటుంది.
సిగ్నల్స్ వద్ద ఆఫ్ చేయాలి..
ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఇంజిన్‌ను ఐడిల్‌లో ఉంచకుండా ఉండడం కూడా కీలకం. నగరాల్లో సిగ్నల్స్ వద్ద ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచితే వేడి పెరిగి అది అక్కడే నిల్వవుతుంది. దీర్ఘకాలం పాటు సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా థర్మల్ లోడ్ తగ్గించవచ్చు. హైవేపై ప్రయాణం చేసే సమయంలో సహజ గాలివీస్తూ ఉండటం వల్ల కూలింగ్ మెరుగ్గా ఉంటుంది. ఎయిర్ ఫిన్స్, రేడియేటర్ భాగాలను శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమే. దుమ్ము పేరుకుపోతే గాలి ప్రవాహం అడ్డంకి ఏర్పడి ఓవర్‌హీటింగ్ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్ కూల్డ్ బైక్‌లు బయట కనిపించే ఫిన్స్‌పై ఆధారపడుతాయి. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల వేడి విసర్జన మెరుగుపడి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
తరచూ సర్వీసింగ్ అవసరం..
స్పార్క్ ప్లగ్, ఇంధన మిశ్రమాన్ని తనిఖీ చేయడం అవసరం. లోపభూయిష్ట స్పార్క్ ప్లగ్ లేదా లీన్ ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమం ఉండటం వల్ల దహన ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్రమబద్ధమైన సర్వీసింగ్ సమయంలో వీటిని పరిశీలించడం ద్వారా ఓవర్‌హీటింగ్ ను నివారించడమే కాకుండా మైలేజ్ ను కూడా కాపాడుకోవచ్చు. అయితే ఆధునిక బైక్‌లు ఇంధన సామర్థ్యం, ఎమిషన్ ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నందున, పని చేసే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో అవగాహన కలిగి ఉండడం అవసరం. ఇక ఇంజిన్ మరమ్మత్తులతో పోలిస్తే ముందస్తు నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కనుక వాహనాలను తరచూ సర్వీసింగ్ చేయించడం మంచిది. ఇలా ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రయాణించే వాహనదారులు ఈ ఐదు చర్యలను పాటిస్తుంటే వాహన బ్రేక్‌డౌన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దీంతోపాటు వాహనం దీర్ఘకాలం సురక్షితంగా ఉంటుంది. అలాగే రీసేల్ విలువ కూడా పెరుగుతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






