IDFC First Bank | రూ.590 కోట్ల మోసం ఘటనతో.. భారీగా పతనమైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు..
IDFC First Bank | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పతనం అయ్యాయి. చండీగఢ్‌లోని ఆ బ్యాంకు శాఖలో రూ.590 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో షేర్ ధర గరిష్టంగా 15 శాతం వరకు పడిపోయింది. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనగా మార్కెట్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే షేర్ లోయర్ సర్క్యూట్‌కు చేరుకుంది.
IDFC First Bank | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పతనం అయ్యాయి. చండీగఢ్‌లోని ఆ బ్యాంకు శాఖలో రూ.590 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో షేర్ ధర గరిష్టంగా 15 శాతం వరకు పడిపోయింది. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనగా మార్కెట్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే షేర్ లోయర్ సర్క్యూట్‌కు చేరుకుంది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్ ధర రూ.75.16 వద్ద ప్రారంభం కాగా ఇది గత సెషన్ ముగింపు ధర రూ.83.51తో పోలిస్తే దాదాపు 10 శాతం తక్కువ కావడం గమనార్హం. కొద్ది నిమిషాల్లోనే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఎన్ఎస్ఈలో ఉదయం ట్రేడింగ్‌లో షేర్ ధర రూ.70.98కి పడిపోయి 15 శాతం నష్టాన్ని నమోదు చేసింది. బ్యాంకు తన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసాన్ని గుర్తించినట్లు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకు తెలియడంతో ఒక్కసారిగా భారీగా అమ్మకాలు జరిగాయి.
ఘటనపై ఫోరెన్సిక్ ఆడిట్..
చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు శాఖలో రూ.590 కోట్ల మోసం జరిగిందని బ్యాంకు వర్గాలు ఈ నెల 22న గుర్తించాయి. నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఘటన హర్యానా ప్రభుత్వానికి అనుసంధానమైన ఖాతాల్లో అనధికార లావాదేవీలకు సంబంధించిందిగా తేలింది. ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న నలుగురు ఉద్యోగులను బ్యాంకు ఇప్పటికే సస్పెండ్ చేసింది. జరిగిన ఘటనపై బ్యాంకు అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్‌ను ప్రారంభించారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద ఖాతాలు, లావాదేవీలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
గణనీయమైన వృద్ధి సాధించినా..
మోసం ఘటనపై బ్యాంకు సీఈవో వి.వైద్యనాథన్ స్పందించారు. బ్యాంకు శాఖలోని కేవలం కొన్ని ఖాతాదారుల ఖాతాలకే ఈ సమస్య పరిమితమైందని తాము భావిస్తున్నామని, ఇతర శాఖలు లేదా రిటెయిల్ కస్టమర్లపై ఈ ఘటన ప్రభావం చూపినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, తుది ఆర్థిక ప్రభావం ఎంత అన్న విషయం స్పష్టంగా తేలాల్సి ఉందన్నారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవానికి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు గణనీయమైన వృద్ధిని సాధించినట్లు ఫలితాలు వచ్చాయి. నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 48 శాతం పెరిగి రూ.503 కోట్లకు చేరిందని ఫలితాల్లో తేలింది. అయినప్పటికీ బ్యాంకులో ఈ భారీ మోసం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి బ్యాంకు షేర్ ధర భారీగా పతనం అయింది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



