త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IDFC First Bank | చండీగ‌ఢ్ ఫ్రాడ్ క్లెయిమ్‌ల‌కు రూ.645 కోట్ల‌ను చెల్లించిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌

IDFC First Bank | చండీగఢ్‌లోని ఓ శాఖలో జరిగిన మోసం కేసుకు సంబంధించి వచ్చిన అన్ని క్లెయిమ్‌లను రూ.645 కోట్లతో పరిష్కరించామని, ఇకపై ఎలాంటి కొత్త స‌మ‌స్య‌లు లేవ‌ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు బ్యాంకు మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసింది.

S

Business | Published On Mar 10, 2026, 2.18 pm IST

IDFC First Bank | చండీగ‌ఢ్ ఫ్రాడ్ క్లెయిమ్‌ల‌కు రూ.645 కోట్ల‌ను చెల్లించిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌
Advertisement

IDFC First Bank | చండీగఢ్‌లోని ఓ శాఖలో జరిగిన మోసం కేసుకు సంబంధించి వచ్చిన అన్ని క్లెయిమ్‌లను రూ.645 కోట్లతో పరిష్కరించామని, ఇకపై ఎలాంటి కొత్త స‌మ‌స్య‌లు లేవ‌ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు బ్యాంకు మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసింది. గత నెలలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్‌లోని ఓ ప్రత్యేక శాఖలో కొంతమంది ఉద్యోగులు, ఇతరులు కలిసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలకు సంబంధించి రూ.590 కోట్ల మోసానికి పాల్ప‌డినట్లు వెల్లడించింది. మంగళవారం స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన నియంత్రణ ప్రకటనలో బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం, మొదట అంచనా వేసిన ప్రధాన మొత్తం రూ.590 కోట్లకు బదులుగా మొత్తం క్లెయిమ్‌లను స్వీకరించి రూ.645 కోట్ల నికర ప్రధాన మొత్తాన్ని చెల్లించామని తెలిపింది. ఇది ప్రారంభ అంచనాతో పోలిస్తే రూ.55 కోట్లు ఎక్కువగా ఉందని పేర్కొంది.

క్లెయిమ్‌లు అన్నీ ఆ శాఖ‌కు చెందిన‌వే..

ఈ క్లెయిమ్‌లు అన్నీ అదే సంఘటనకు సంబంధించినవే అని, అదే చండీగఢ్ శాఖకు అనుసంధానమైనవే అని బ్యాంకు స్ప‌ష్టం చేసింది. ఇది కొత్త ఘటన కాద‌ని, ప్రస్తుతం ఎలాంటి ఇతర పెండింగ్ క్లెయిమ్‌లు లేవు అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. అలాగే ఈ మోసానికి బాధ్యులైన వ్యక్తులపై చర్యలు కొనసాగిస్తూ బాకీలను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని కూడా పేర్కొంది. అదనంగా బ్యాంక్ తెలిపిన ప్రకారం సంబంధిత అన్ని ఖాతాల సమన్వయ ప్రక్రియను పూర్తి చేసి ఇత‌ర‌ లోపాలు ఏవీ గుర్తించలేదని వెల్లడించింది. 2026 ఫిబ్రవరి 25 తర్వాత చండీగఢ్ శాఖ నుంచి లేదా దేశంలోని ఇతర ఏ సంస్థ నుంచి కూడా కొత్త క్లెయిమ్‌లు అందలేదని బ్యాంక్ తెలిపింది.

బ్యాంకు డిపాజిట్లు రూ.2.92 ల‌క్ష‌ల కోట్లు..

బ్యాంక్ మొత్తం డిపాజిట్ నిల్వలు స్థిరంగా కొనసాగుతున్నాయని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పేర్కొంది. 2026 ఫిబ్రవరి 28 నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్‌లు రూ.2,92,381 కోట్లుగా ఉన్నాయని, 2025 డిసెంబర్ 31 నాటికి అవి రూ.2,91,133 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో డిపాజిట్‌లు, రుణాల్లో వృద్ధి గత ధోరణులకు అనుగుణంగా కొనసాగుతాయ‌ని బ్యాంక్ అంచనా వేసింది. బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ప్ర‌స్తుతం రూ.67.17 వద్ద ట్రేడవుతుండ‌గా, ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 0.61 శాతం పెరుగుదలగా నమోదు కావ‌డం విశేషం.

Advertisement
Advertisement