HDFC Bank | నాలుగు రూల్స్‌ని మార్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు..!
HDFC Bank | దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) ఇటీవల పలు నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ నెలలోనే కొన్ని కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. మరికొన్ని రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది.
HDFC Bank | దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) ఇటీవల పలు నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ నెలలోనే కొన్ని కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. మరికొన్ని రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. రుణాలపై వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీలు, ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, లాకర్ చార్జీలు మార్పులు వర్తించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ముఖ్యంగా ఎంసీఎల్‌ఆర్ రేట్లను గరిష్టంగా 10 పది బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దాంతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న వారికి కొంత వరకు ఊరట కలుగనున్నది. కొత్త ఎంసీఎల్‌ఆర్ రేట్లు మార్చి 7 నుంచి అమలులోకి వచ్చాయి. ఓవర్‌నైట్ 8.15శాతం, ఒక నెల 8.15శాతం, మూడు నెలలు 8.25శాతం, ఆరు నెలలు 8.35శాతం, సంవత్సరం 8.35శాతం, రెండు సంవత్సరాలు 8.45శాతం, మూడేళ్లకు 8.55 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో రుణగ్రహీతలకు కొంత వరకు భారం తగ్గనున్నది.
ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పులు
మార్చి 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా బ్యాంకు సవరించింది. పలు డిపాజిట్ పథకాలపై పది బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయించింది. మూడేళ్ల నుంచి సంవత్సరాల ఒక రోజు నుంచి 4 సంవత్సరాలు 7 నెలల లోపు ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ 6.40 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. అదే కాలపరిమితితో ఉన్న సీనియర్ సిటిజన్లకు వడ్డీ 6.90శాతం నుంచి 7శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.
యూపీఐ, ఏటీఎం కొత్త నిబంధనలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు తీసుకునే విధానంలో మార్పలు చేసింది. ఈ రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా తీసుకునే నగదు కూడా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ పరిమితిలో భాగంగా లెక్కించనున్నారు. ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.23 చార్జీ వసూలు చేయనుంది. అలాగే, సేఫ్ డిపాజిట్ లాకర్ అద్దెలను కూడా బ్యాంకు సవరించింది. ఈ మార్పులు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ‘మెట్రో ప్లస్’ పేరుతో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది. లాకర్ అద్దె లాకర్ పరిమాణం, బ్రాంచ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అన్ని లాకర్ చార్జీలపై అదనంగా 18శాతం జీఎస్టీ వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






