Gold Purity Check | బంగారం కొంటున్నారా.. ప్యూరిటీ, హాల్ మార్క్ ధ్రువీకరణ ఇలా చెక్ చేయండి..
Gold Purity Check | గతేడాది కాలం నుంచి అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, దేశాల ఆర్థిక మందగమనం, ఏఐ వంటి అనేక కారణాల వల్ల ప్రజలు, ప్రభుత్వాలు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకనే ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి.
Gold Purity Check | గతేడాది కాలం నుంచి అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, దేశాల ఆర్థిక మందగమనం, ఏఐ వంటి అనేక కారణాల వల్ల ప్రజలు, ప్రభుత్వాలు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకనే ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం మేర లాభాలు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బంగారం కొనుగోళ్లకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రజలు తాము కొనుగోలు చేసే బంగారు ఆభరణాలు లేదా వస్తువుల విషయంలో మోసపోకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. పేరుగాంచిన షోరూంలలో మోసాలు జరగవని అనుకుంటారు. కానీ వారు కూడా మోసం చేసిన ఘటనలను చూస్తున్నారు కనుక బంగారం కొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బంగారం ఎంత శుద్ధిగా ఉంది, స్వచ్ఛమైనదేనా వంటి విషయాలను తెలుసుకోవాలి.
BIS లోగో తప్పనిసరి..
ప్రజలు తాము కొనే బంగారు వస్తువులు లేదా ఆభరణాలపై BIS లోగో ఉండాలి. ఇది త్రిభుజాకారంలో ఉండే చిన్న గుర్తు. Bureau of Indian Standards (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ద్వారా ఆ వస్తువు లేదా ఆభరణం ధ్రువీకరించబడిందనే విషయాన్ని ఆ గుర్తు సూచిస్తుంది. ఆ గుర్తు బంగారం శుద్ధిని, స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఆ గుర్తు ఉంటే బంగారం శుద్ధికి విశ్వసనీయ సూచికగా భావించవచ్చు. ఇక బంగారం ప్యూరిటీ, ఫైనెస్ వివరాలను కూడా తెలుసుకోవాలి. వీటిని క్యారెట్లలో సూచిస్తారు. ఉదాహరణకు 22K916 అంటే 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం అని అర్థం. దీన్ని సాధారణంగా బంగారు ఆభరణాల తయారీలో వాడుతారు. అలాగే 18K750 అంటే 75 శాతం స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అంటే మిగిలిన మొత్తంలో ఇతర లోహాలను కలుపుతారు. దీన్ని వజ్రాలు లేదా ఇతర రత్నాలతో ఉన్న ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.

HUID తో వెరిఫికేషన్..
బంగారు ఆభరణాలపై HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఉందా, లేదా కూడా గమనించాలి. ఇది A1B2C3 వంటి ఆరు అంకెల ఆల్ఫాన్యుమరిక్ కోడ్‌గా ఉంటుంది. ప్రతి ఆభరణానికి ఇది ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది. 2026 దీన్ని అత్యంత కీలక ధ్రువీకరణ సంఖ్యగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ వెరిఫికేషన్ కోసం వినియోగదారులు BIS Care App ను ఉపయోగించవచ్చు. ఇందులో వెరిఫై HUID అనే సెక్షన్‌లో కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీంతో జ్యువెల్లర్ పేరు, హాల్ మార్కింగ్ సెంటర్ వివరాలు, తేదీ, ప్యూరిటీ తదితర సమాచారాన్ని తెలియజేస్తుంది. ఆ వివరాలను ఆభరణానికి ఉన్న ట్యాగ్ పై ఉన్న వివరాలతో పోల్చుకోవాలి. ఏవైనా తేడా ఉంటే దాన్ని అనుమానాస్పదంగా భావించాలి.
క్యారెట్ మీటర్ టెస్ట్..
కస్టమర్లు జ్యువెల్లరీ షాపుల్లో క్యారెట్ మీటర్ పరీక్షను కూడా చేయించుకోవచ్చు. ఎక్కువగా XRF (ఎక్స్-రే ఫ్లోరెసెన్స్) యంత్రంతో ఈ పరీక్ష చేస్తారు. ఇది ఆభరణాన్ని దెబ్బ తీయకుండా లోహాల కూర్పును విశ్లేషించి బంగారం, వెండి, రాగి ఎంత శాతంలో ఉన్నాయో తెలియజేస్తుంది. ఈ పరీక్షను బిల్లింగ్‌కు ముందు కస్టమర్ తన సమక్షంలోనే చేయించుకోవచ్చు. సాధారణంగా ఒక చిన్న మాగ్నెట్ టెస్టు ద్వారా కూడా బంగారు ఆభరణాలను పరీక్ష చేయవచ్చు. స్వచ్ఛమైన బంగారం మాగ్నెట్ ఆకర్షణకు గురికాదు. ఆభరణం మాగ్నెట్‌కు ఆకర్షితమైతే అందులో ఇతర లోహాలు ఉన్నట్లు పరిగణించాలి.
ఇన్‌వాయిస్ స్పష్టంగా ఉండాలి..
బంగారం కొనుగోలు సమయంలో సరైన ఇన్‌వాయిస్ కూడా చాలా ముఖ్యం. బిల్లులో ప్రతి ఆభరణానికి సంబంధించిన HUID నంబర్, క్యారెట్లలో ప్యూరిటీ, బరువు (గ్రాముల్లో), కొనుగోలు రోజున గోల్డ్ రేట్ వివరాలు ఉండాలి. అదనంగా మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వివరాలు స్పష్టంగా ఉండాలి. ఇది పారదర్శకతను నిర్ధారించి, ఆభరణం నిజమైన విలువను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే ముందు సరైన పరిశీలన చేయడం ద్వారా మోసాలకు గురికాకుండా, సురక్షితంగా కొనుగోళ్లు జరపవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BIS | బంగారం కొనేవారికి షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీలు 66.7 శాతం పెంపు..
సెప్టెంబర్ 17, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
- ●Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..
- ●Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు
- ●వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!
- ●NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో - బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్

Special Trains | ప్రయాణికులకు తీపికబురు..! పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..

Amazon Alexa Plus | అమెజాన్ నుంచి అలెక్సా ప్లస్.. ఇక మీ మాటే ఆదేశం..

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు



