త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డుల‌కు ఇదే మంచి స‌మ‌యం..

Gold And Silver Prices Today | ఇరాన్‌తో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతోపాటు, ఇరాన్ కూడా హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరుస్తున్నామ‌ని చెప్ప‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు జోష్ వ‌చ్చింది. గ‌త రాత్రి అమెరికా మార్కెట్ల‌లో భారీ బుల్ ర్యాలీ చోటు చేసుకుంది.

S

Business | Published On Apr 18, 2026, 11.42 am IST

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డుల‌కు ఇదే మంచి స‌మ‌యం..
Advertisement

Gold And Silver Prices Today | ఇరాన్‌తో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతోపాటు, ఇరాన్ కూడా హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరుస్తున్నామ‌ని చెప్ప‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు జోష్ వ‌చ్చింది. గ‌త రాత్రి అమెరికా మార్కెట్ల‌లో భారీ బుల్ ర్యాలీ చోటు చేసుకుంది. విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ కూడా భారీ ర్యాలీ క‌న‌బ‌రిచింది. దీంతో సోమ‌వారం నాడు మార్కెట్లు భారీ లాభాల్లో ఓపెన్ అవుతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఇదే ఉత్సాహంతో పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి వంటి లోహాల‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున ఆస‌క్తిని చూపించారు. దీంతో వాటి ధ‌ర‌లు కూడా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఏకంగా 40 డాల‌ర్లు పెరిగి 4,831 వ‌ద్ద ముగిసింది. అలాగే వెండి ధ‌ర 2.37 డాల‌ర్లు పెరిగి 80.80 డాల‌ర్ల వ‌ద్ద స్థిర ప‌డింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1457 పాయింట్లు (0.95 శాతం) పెరిగి 1,54,609 వ‌ద్ద ముగియ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 8,514 పాయింట్లు (3.42 శాతం) ఎగ‌బాకి 2,57,142 వ‌ద్ద స్థిర ప‌డింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌ల్లో పెరుగుద‌ల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,578 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,24,624 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,55,780 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,57,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,100 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,280 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14,240గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,42,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,28,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,684 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.93,472గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,16,840 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,68,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,75,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.10వేల మేర పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,80,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,800 గా ఉంది.

Advertisement
Advertisement