Gold And Silver Prices Today | బంగారం ధర మళ్లీ పరుగులు.. యుద్దం ముగింపు సూచనలతోనే..
Gold And Silver Prices Today | పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా, ఇరాన్‌లు మళ్లీ యుద్ధం బాట పడతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ స్థాయిలో పతనాన్ని చవి చూశాయి.
Gold And Silver Prices Today | పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా, ఇరాన్‌లు మళ్లీ యుద్ధం బాట పడతాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ స్థాయిలో పతనాన్ని చవి చూశాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపేందుకు ఇరాన్ తమను సంప్రదించిందని మరోమారు తాజాగా ప్రకటన చేయడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం ఔన్స్ బంగారం ధర 23 డాలర్లు పెరిగి 4,764 వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర 1.40 డాలర్లు పెరిగి 77 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌కు అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మంగళవారం కమోడిటీ మార్కెట్లు మూసి ఉన్నాయి. కానీ సాయంత్రం 5 గంటలకు న్యూయార్క్ సెషన్‌లో ఎంసీఎక్స్ ఓపెన్ కానుంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,393 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,144 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,53,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,39,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,110 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,11,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,545 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,360గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,54,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



