CJP Protest | ఢిల్లీలో అప్రకటిత కర్ఫ్యూ.. రాత్రికి రాత్రే 400 మందికిపైగా అరెస్ట్
CJP Protest | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. ఎక్కడ చూసినా భద్రతా పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలు, బారికేడ్లే దర్శనమిస్తున్నాయి. నగర వ్యాప్తంగా 45 మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి.
CJP Protest | త్రినేత్ర న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. ఎక్కడ చూసినా భద్రతా పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలు, బారికేడ్లే దర్శనమిస్తున్నాయి. నగర వ్యాప్తంగా 45 మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, కశ్మీర్ గేట్ స్టేషన్లు వీటిలో ఉన్నాయి. లోకల్ రైళ్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 250కిపైగా రైళ్లు రద్దయ్యాయి. ఎస్ఐఆర్ (SIR) అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద భారీ నిరసనకు (CJP Protest) పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 25 వేలకుపైగా భద్రతా బలగాలను మోహరించారు. రాత్రికి రాత్రే సుమారు 400 మందికిపై అరెస్టు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజధానిలోని 15 జిల్లాల పరిధిలో 30 నుంచి 40 మంది నేరచరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
సీజేపీ నిరసనకు అనుమతి లేదని, అందులో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ధర్మశాలల్లో సోదాలు నిర్వహించారు. ఆందోళనలకు జనసమీకరణ చేసే అవకాశమున్న దాదాపు 200 మంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిఘా ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యగా దిల్లీవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు.

శనివారం ఉదయం 6 గంటల నుంచే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కన్నాట్ ప్లేస్, మండి హౌస్, ధౌలా కువాన్, పటేల్ చౌక్, ఆర్ఎమ్‌ఎల్ హాస్పిటల్ సర్కిల్ సహా 30 కీలక రహదారులపై రాకపోకలను నిషేధించారు. విమానాల ద్వారా రాజధానికి వచ్చి నిరసనలో పాల్గొనాలని భావిస్తున్న ప్రయాణికుల జాబితాను సీఐఎస్‌ఎఫ్ సేకరిస్తున్నది. విమానాశ్రయం నుంచి జంతర్ మంతర్ వైపు వెళ్లే వారిని దారిలోనే అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

2020 అల్లర్ల తర్వాత ఇదే తొలిసారి..
ప్రస్తుతం దిల్లీ వ్యాప్తంగా ఢిల్లీ పోలీసులతో కలిపి ఏకంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో చేరినట్టు తెలుస్తున్నది. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లు, ఈశాన్య ఢిల్లీ హింసాకాండ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన తర్వాత రాజధానిలో ఈ స్థాయిలో బలగాలను రంగంలోకి దించడం ఇదే తొలిసారి. జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ (బస్తర్) వంటి సుదూర ప్రాంతాల నుంచి బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్ సంస్థలకు చెందిన 110 అదనపు కంపెనీలను ఢిల్లీకి రప్పించారు.

ఢిల్లీ బయల్దేరిన అభిజీత్ దీప్కే
మరోవైపు జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ముంబై నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయన వెంట ఆ పార్టీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఉన్నారు. దీప్కే బృందం ఉదయం 10 గంటల కల్లా దిల్లీ చేరుకునే అవకాశం ఉందని సీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | పోలీసుల నిర్బంధంలో అభిజిత్ దీప్కే.. విమానంలోనే అదుపులోకి..
అక్టోబర్ 10, 2026

Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..
అక్టోబర్ 9, 2026

Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..
- ●Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్లో సిబ్బంది అరాచకాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?
- ●Jio Platforms IPO | అక్టోబర్ 21న జియో ఐపీఓ.. షేర్ ధర రూ.1,119..?
- ●Suicide | బావిలో దూకి.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలవన్మరణం

Gold Investment | ఐఫోన్ వద్దనుకుని బంగారం కొన్నాడు.. 3 ఏళ్లలో రెండింతలకు పైగా లాభం..

Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్లో సిబ్బంది అరాచకాలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?



