Gold And Silver Prices Today | బంగారం, వెండిపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తి.. ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం వరుసగా రెండు రోజులు పతనమయ్యాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం వరుసగా రెండు రోజులు పతనమయ్యాయి. పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు మొగ్గు చూపిస్తుండడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో వచ్చే వారం మార్కెట్ దిశ ఏవైపు ఉండనున్నది అనే విషయం కీలకంగా మారింది. అయితే బంగారం, వెండి లోహాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. పెట్టుబడిదారులు ఈ సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.61 శాతం పెరిగి 4,715 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 2.31 శాతం ఎగబాకి 80.34 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 269 పాయింట్లు పెరిగి 1,52,530 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,382 పాయింట్లు పెరిగి 2,61,922 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,225 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,880 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,23,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,300 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,965 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,96,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,426 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,408గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,260 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,42,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధర కేజీకి రూ.2వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



